వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఆయన బంగారం, వేధిస్తున్నారు: విందూ భార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Vindu and Dina Umarova
ముంబై: తన భర్తను వేధిస్తున్నారని స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ భార్య దీనా ఉమరోవా అన్నారు. విందూ దారాసింగ్ పోలీసు కస్టడీని కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత విందూ మీడియాతో మాట్లాడారు. తాను బెట్టింగుకు పాల్పడినట్లు విందూ అంగీకరించాడని, ప్రతి విషయం పోలీసులకు చెప్పాడని, ఇంకా ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారని ఆమె అన్నారు.

విశాలమైన, బంగారంలాటి మనసు గల అత్యంత గొప్ప వ్యక్తి విందూ అని, అతని వంటి వ్యక్తిని తాను జీవితంలో చూడలేదని, మీడియానే దాన్ని పెద్దగా చేస్తోందని ఆమె అన్నారు. విందూది బెయిల్ లభించే నేరమని, అయితే రాజకీయ కారణాలతో విందూను వేధిస్తున్నారని ఆమె అన్నారు.

విందూను పోలీసులు మే 21వ తేదీన అరెస్టు చేశారు. ఐపియల్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు ఒడిగట్టిన బుకీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసులు విందూను అరెస్టు చేశారు. ఆయనపై చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. బుకీ అయిన మిత్రుడు ఆనంద్ ద్వారా తాను బెట్టింగులోకి వచ్చినట్లు విందూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. చాలా కాలం నుంచి ఆనంద్ తనకు తెలుసునని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

దుబాయ్‌కి పారిపోవడానికి బుకీలు సంజయ్ జైపూర్, పవన్ జైపూర్‌లకు సాయం చేసినట్లు కూడా విందూ పోలీసులకు చెప్పాడు. బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ తరఫున తాను బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు కూడా అతను చెప్పాడు. గురునాథ్ మేయప్పన్‌ను పోలీసులు ఈ నెల 24వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగులు కట్టిన కొంత మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను కూడా విందూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

English summary
Vindu's wife Dina Umarova said her husband is being victimised. "He has admitted he was betting. He has told them everything. So why are they still holding him?" said Dina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X