వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ 'జె' టెండర్స్: తుమ్మల, కడియంపై మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli Narasimhulu and Tummala Nageswara Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని పదవినే తిరస్కరించిన వారని, అలాంటి వ్యక్తికి పనికిమాలిన కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు కావాల్సిన అవసరమేముందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు మంగళవారం మహానాడులో అన్నారు. ఆయన పతనమవుతున్న రాజకీయ విలువలు, అక్రమార్జన, పేదరిక నిర్మూలన తీర్మానాలప తుమ్మల మాట్లాడారు.

రాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, డిఫ్యూటీ స్పీకర్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆ పార్టీకి ఓట్లు వేసిన సన్నాసులకు తమను అనే నైతిక హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. 1983-89 వరకూ తెలుగుదేశం పార్టీ రామరాజ్యం అందించిందని, 1995 నుంచి అభివృద్ధి రాజ్యాన్ని చూపించిందని, గుజరాత్ కంటే ముందే దేశమంతా అబ్బురపడేలా, అనుకరించేలా అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని, నీతి నిజాయతీలతో పాలించామన్నారు.

టెండర్లలో అక్రమాలను నివారించడానికి ఇ-టెండర్లు టిడిపి ఈ-టెండర్లు పెడితే, వైయస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఇ-టెండర్లు పోయి జె-టెండర్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. జగన్ ఎవరి పేరు చెబితే వారికే టెండర్లన్నారు. ఎంత నిజాయతీగా పాలించినా కరువును అవకాశంగా తీసుకొని మాపై దుష్ప్రచారం చేశారని, తెలుగుదేశం పాలన సమయంలో రాష్ట్ర ప్రజలు దేశంలో తల ఎత్తుకొని నిలబడగలిగేవారన్నారు. వైయస్ సమయంలో తల దించుకొని నిలబడ్డారన్నారు.

ముఖ్యమంత్రి పదవి మీద ఆశతోనే కడియం శ్రీహరి తెరాసలో చేరారని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. "దొంగ కుల సర్టిఫికేట్‌తో ఇంతకాలం టిడిపిని మోసం చేశారు. ఆ నియోజకవర్గం ప్రజలను మోసగించారు. ఆయన మాల కాదు.. మాదిగ కాదు. మరీ ఏ కులమో కడియమే చెప్పాలి. దీనిపై నేను అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాన''ని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ కోసం లేఖ రాస్తే టిడిపి కార్యాలయం వద్ధ అటెండరు పని చేస్తానని చెప్పినా హరీశ్ రావు ఇప్పుడేమీ చేస్తున్నారని ప్రశ్నించారు. టిడిపిని దెబ్బతీయడానికి కాంగ్రెస్‌తో కెసిఆర్ కుమ్మక్కయ్యారన్న ఆయన.. అందుకే సోనియాని విమర్శించడం లేదని మండిపడ్డారు.

English summary
Telugudesam Party senior leader Mothkupalli Narasimhulu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X