వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళంకితులపై రాయపాటి, జైలుపార్టీ అని జగన్‌పై వీరశివా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
చిత్తూరు: రాష్ట్రంలోని కళంకిత మంత్రులను అధిష్టానం తొలగిస్తుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మంగళవారం ఆశాభావం వ్యక్తం చేశారు. రాయపాటి, మంత్రులు సి.రామచంద్రయ్య, పార్థసారథిలు మంగళవారం ఉదయం శ్రీవారిని దర్సించుకున్నారు. అనంతరం రాయపాటి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బతకాలంటే కళంకిత మంత్రులను తొలగించాల్సిందే అన్నారు.

కర్నాటక రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉండగా మంత్రులు అవినీతికి పాల్పడిన కారణంగా ఆ పార్టీని ఓడించి కాంగ్రెసుకు అక్కడి ఓటర్లు పట్టం కట్టారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జాగ్రత్త పడాలని సూచించారు. అక్రమాలతో ప్రత్యక్ష సంబంధం లేకు్ననా ఆరోపణల నేపథ్యంలో పవన్ కుమార్ బన్సల్, అశ్వనీ కుమార్‌లను కేంద్రం తొలగించిందని ఆయన గుర్తు చేశారు. అధిష్టానం తీసుకునే చర్యలతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

పనికిరాని మంత్రులు వద్దు: వీరశివా

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న పనికిరాని మంత్రులను తొలగించాలని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్ స్వచ్ఛమైన వారికే మంత్రి పదవి ఇవ్వాలని, మంచి పాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు ఆశాజ్యోతి కిరణే అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతితో తడిసి ముద్దై జైల్లో మగ్గుతున్నారన్నారు. జగన్ పార్టీ జైలు పార్టే అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడి కుమారుడు సంపదించనంతగా జగన్ సంపాదించాడని, అప్పుడే సాక్షి మీడియాను పెట్టారని, బెంగళూరులో రాజ్ మహర్, హైదరాబాదులో లోటస్ పాండులు సొంతం చేసుకున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు.

English summary
Guntur Congress MP Rayapati Sambasiva Rao has 
 
 demanded that the ministers facing allegations of 
 
 corruption be removed from their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X