వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు చేయలేదు, నేను అంతే!: రిజైన్‌పై తగ్గని శ్రీనివాసన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srinivasan
న్యూఢిల్లీ: ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ బెట్టు వీడటం లేదు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. సచిన్ పైలట్, రాజీవ్ శుక్లా, అరుణ్ జైట్లీ తదితరులు శ్రీనివాసన్ రాజీనామా చేయాలని సూచించారు. కానీ వారి మాటలను ఆయన తోసిపుచ్చుతున్నారు. రాజీనామా చేసేది లేదంటూ తెగేసి మరోసారి చెప్పారు.

గతంలో ఆరోపణలు వచ్చినప్పుడు బిసిసిఐ చీఫ్‌లుగా ఉన్నవారు రాజీనామాలు చేసిన సందర్భాలు లేవని, అలాంటప్పుడు తాను ఎందుకు వైదొలగాలని ప్రశ్నిస్తున్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన చెబుతున్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, వారి విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోనన్నారు. దర్యాఫ్తులో దోషులని తేలితే చెన్నై సూపర్ కింగ్స్ పైన తాను చర్యలు తీసుకుంటానని చెప్పారు.

అంతకుముందు మాత్రం రాజీవ్ శుక్లా, అరుణ్ జైట్లీలు భేటీ అయ్యారు. అనంతరం శుక్లా మాట్లాడుతూ... బిసిసిఐ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత శ్రీనివాసన్ పైన ఉందని, పదవి నుండి తప్పుకోవాలని సూచించామని అన్నారు. శ్రీనివాసన్ కొనసాగితే విచారణకు ఇబ్బందులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. విచారణ ముగిసే వరకు ఆయన తప్పుకుంటే మంచిదని సూచించారు.

నేను ఏ తప్పు చేయలేదు: పాక్ ఎంపైర్ రవూఫ్

తాను ఎలాంటి తప్పు చేయలేదని పాకిస్తాన్ ఎంపైర్ రవూఫ్ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన బుధవారం ఖండించారు. తనకు బుకీలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమన్నారు.

కాగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన గురునాథ్ కస్టడీ ఈ నెల 31 వరకు పొడిగించారు.

English summary
Unfazed by mounting demands for his resignation, BCCI President N Srinivasan today continued his streak of defence by refusing to step down from the post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X