వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాట్ ఫిక్సింగ్: భజ్జీ, చెన్నై ఆటగాళ్లను విచారిస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Harbhajan Singh
ముంబై: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్‌ను, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లను ముంబై పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన గురునాథ్ మేయప్పన్‌కు దగ్గరగా ఉన్న ముగ్గురు చెన్నై జట్టు ఆటగాళ్లను పోలీసులు విచారిస్తారని అంటున్నారు. వారిని ప్రభావితం చేయడానికి గురునాథ్ ప్రయత్నించాడా అనే విషయాన్ని కనుక్కోవడానికి పోలీసులు వారిని విచారించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

తర్వాతి మ్యాచులకు హర్భజన్‌ను ఫిక్సింగ్‌కు సిద్ధం చేయాలని గురునాథ్ మేయప్పన్ తనకు చెప్పినట్లు బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. గురునాథ్‌తో సంబంధాలున్న ఆటగాళ్ల వాంగ్మూలాలు తీసుకునే విషయంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

గురునాథ్‌తో సాన్నిహిత్యం ఉన్న చెన్నై హోటల్ యజమాని విక్రమ్ అగర్వాల్ అలియాస్ విక్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని ముంబై పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న బుకీలు సంజయ్ జైపూర్, పవన్ జైపూర్, చంద్రేష్ అలియాస్ జూపిటర్‌లతో సంభాషణలపై పోలీసులు వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.

పలువురు ఆటగాళ్లు చెన్నైలోని అగర్వాల్ హోటల్‌ను సందర్శిస్తూ ఉండేవారు. అగర్వాల్ గురునాథ్‌కు సన్నిహిత మిత్రుడు. అగర్వాల్‌కు సమన్లు జారీ చేయడానికి ముంబై పోలీసులు చెన్నై వెళ్లారు. అయితే, అతను అందుబాటులో లేడు. అగర్వాల్ తన భార్య పేరు మీద సిమ్ కార్డు తీసుకుని దాని ద్వారా మాట్లాడుతూ వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

English summary
The Mumbai crime branch is likely to question Harbhajan Singh and three players from Chennai Super Kings who were close to Gurunath Meiyappan to know if he had tried to influence them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X