వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైల్లో శ్రీశాంత్ నిద్రలేమి రాత్రి, దాల్ చావల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన బౌలర్ శ్రీశాంత్ తీహార్ జైలులో నిద్రలేమి రాత్రిని గడిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తీహార్ జైలులోని చిన్నపాటి సెల్‌లో శ్రీశాంత్‌ను ఉంచారు. అరెస్టయిన తర్వాత తీహార్ జైలులో శ్రీశాంత్ సోమవారం తొలి రాత్రి గడిపాడు. అయితే, ఇతర ఖైదీలతో కలిసి దాల్ చావల్ తిన్నట్లు తెలుస్తోంది.

శ్రీశాంత్‌ను పోలీసులు మే 16వ తేదీన ముంబైలో అరెస్టు చేశారు. అతనితో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు అంకిత్ చవాన్, అజిత్ చండిలలను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశాంత్‌తో పాటు ఇద్దరు విచారణ ఖైదీలు సెల్‌లో ఉన్నారు. జైలుకు వచ్చినప్పుడు శ్రీశాంత్ కాస్తా హాయిగానే కనిపించాడని, ఎక్కువగా మాట్లాడలేదని చెబుతున్నారు.

రాత్రి మాత్రం కూర్చోవడం ద్వారా, సెల్‌లో నడవడం ద్వారా కాలం గడిపాడని అంటున్నారు. దాదాపు అతను రాత్రి నిద్రపోలేదని చెబుతున్నారు. శ్రీశాంత్‌ను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అరెస్టయినప్పటి నుంచి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు.

రాత్రి భోజనం సమయంలో ఇతరులతో పాటు శ్రీశాంత్ వరుసలో నించున్నాడని, దాల్, చావల్ తీసుకున్నాడని అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఉదయం పూట చాయ్, కొన్ని బిస్కట్లు తీసుకున్నట్లు చెబుతున్నారు. ముగ్గురు ఆటగాళ్లకు కూడాీ చాపలు, బెడ్ షీట్లు ఇచ్చినట్లు అధికారులు చెప్పారని మీడియాలో వార్తలు వచ్చాయి.

English summary
According to media reports - Sacked Rajasthan Royals player S. Sreesanth spent a sleepless first night in a small cell in Tihar jail, but ate "dal-chawal" with other prisoners, jail officials said in Delhi on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X