వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌పై కేసు నమోదుకు ఆదేశం: వివేక్‌కు బుజ్జగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కేసు నమోదు చేయాలని ఖమ్మం జిల్లా కోర్టు పోలీసులను గురువారం ఆదేశించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పట్ల కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రామారావు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కోర్టు కెసిఆర్‌పై కేసును నమోదు చేయాలని ఆదేశించింది.

గత జనవరిలో కెసిఆర్ ప్రధాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. తెలుగు దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా రామారావు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అతను డిజిపి వద్దకు వెళ్లారు. విచారించాలని డిజిపి జిల్లా పోలీసులను ఆదేశించారు. కేసు ముందుకు కదలక పోవడంతో అతను జిల్లా కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వివేక్‌కు కెఎల్ఆర్ సూచన

పెద్దపల్లి ఎంపి వివేక్, నాగర్ కర్నూలు ఎంపి మంద జగన్నాథం తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వివేక్‌తో కాంగ్రెసు ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి(కెఎల్ఆర్) భేటీ అయ్యారు. కెసిఆర్‌తో తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీలోనే ఉండాలని సూచించారు. వివేక్‌తో భేటీ అనంతరం కెఎల్ఆర్ మాట్లాడారు.

ఢిల్లీలో, గల్లీలో పవర్ లేని వాళ్లతో తెలంగాణ ఎలా సాధిస్తామని తాను ప్రశ్నించానని, పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని సూచించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ ఇచ్చేలా లేదన్న భావన ఆయనలో కనిపించిందన్నారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని చెప్పానని అన్నారు. కాంగ్రెసు తెలంగాణ గురించి ఆలోచించడం లేదనడంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమన్నారు.

కాగా ఎంపీలు వివేక్, మంద జగన్నాథం, సీనియర్ నేత కె కేశవ రావు తెరాస అధ్యక్షుడు కెసిఆర్‌తో వివేక్ ఇంట్లో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు తెరాసలో చేరికపై ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. వరంగల్ ఎంపి రాజయ్య ఇప్పటికే తెరాసలో చేరికపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

English summary
Khammam Court orders Police to book case against KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X