వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసిసిఐ చీఫ్: ఎవరీ శ్రీనివాసన్, ఎలా ఎదిగారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

N Srinivasan
చెన్నై: ఎన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఎన్ శ్రీనివాసన్ నిరాకరిస్తున్నారు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన శ్రీనివాసన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భారత క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా ఉన్నారు. 67 ఏళ్ల శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందు ఆయన బిసిసిఐ కార్యదర్శిగా పనిచేశారు. శశాంక్ మనోహర్ నుంచి ఆయన 2011లో అధ్యక్ష పదవిని తీసుకున్నారు. ఆయన బిసిసిఐ కోశాధికారిగా కూడా ఉన్నారు. ఇండియా సిమెంట్స్ సహ వ్యవస్థాపకుడైన టిఎస్ నారాయణస్వామికి ఆయన జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ (టెక్) పూర్తి చేశారు. చికాగోలోని ఇలినోయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిప్లమా పొందారు.

శ్రీనివాసన్ 1989లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైయస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1996 నుంచి 1998 వరకు మద్రాసు చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఫిక్కీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కూడా. శ్రీనివాసన్ సిమెంట్ ఉత్పత్తిదారుల సంఘానికి ఐదు విడతలు అధ్యక్షుడిగానూ, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ గవర్నర్ బోర్డు చైర్మన్‌గా నాలుగు విడతలు ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి మండలి చైర్మన్‌గా 1992 నుంచి 1996 వరకు పనిచేశారు.

మద్రాసు చేంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎంసిసిఐ) అధ్యక్షుడిగా రెండు విడతలు 1996 నుంచి 1998 వరకు పనిచేశఆరు. అఖిల భారత ఎంప్లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2000 -2001లో పనిచేశారు. ప్రధాని వాణిజ్య, పారిశ్రామిక మండలి సభ్యుడిగా ఆయన 1996 నుంచి 2001 వరకు పనిచేశారు. ఇండియా సిమెంట్స్ లిమిటెడ్‌కు ఐపియల్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో పెద్ద వాటా ఉంది.

English summary
N Srinivasan remained BCCI secretary before becoming its president, taking over the reins from Shashank Manohar, in 2011. He also remained the board's treasurer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X