వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్: కరుణానిధి సతీమణికి కోర్టు సమన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dayalu Ammal
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాలు అమ్మాళ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసుోల సాక్షిగా జులై 8వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉన్న ఆమె కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

తన ఆరోగ్యం సహకరించడం లేదనే కారణం చెబుతూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కేసులో దయాలు అమ్మాళ్ ముఖ్యమైన సాక్షి అని, 200 కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న కలైంగర్ టీవీకి ఆమె డైరెక్టర్‌గా ఉన్నారని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఒపి సైనీ అన్నారు.

టెలికం మాజీ మంత్రి ఎ రాజా, డిబి రియాల్టీ లిమిటెడ్ ఎండి వినోద్ గోయంకాలతో పాటు కరుణానిధి కూతురు, డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనమొళి, టీవీ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ విచారణను ఎదుర్కుంటున్న స్థితిలో దయాలు అమ్మాళ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

కేసు వాస్తవాలను, పరిస్థితిని బట్ిట దయాలు అమ్మాళ్ కేసులో ముఖ్యమైన సాక్షి అవుతారని, అందువల్ల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి ఆమెకు మినహాయింపు ఇవ్వలేమని న్యాయమూర్తి అన్నారు.

English summary
Tamil Nadu Chief Minister M Karunanidhi's wife Dayalu Ammal will have to appear as a prosecution witness in the 2G spectrum allocation case, a Delhi court said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X