వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురుపై ముందే ఐసిసి హెచ్చరిక: తెలియదన్న మామ

By Pratap
|
Google Oneindia TeluguNews

Gurunath Meiyappan
న్యూఢిల్లీ: బెట్టింగ్ వ్యవహారాలతో, బుకీలతో బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్‌కు గల సంబంధాలపై ఐసిసి ముందే బిసిసిఐ హెచ్చరించిదని తెలుస్తోంది. ఈ విషయాన్ని గురునాథ్‌కు కూడా చేరవేశారని అంటున్నారు. ఏప్రిల్‌లో ఐపియల్ 6 ప్రారంభమైన తర్వాత గురునాథ్‌కు బుకీలతో ఉన్న సంబధాలపై ఐసిసి అవినీతి నిరోధక, భద్రతా విభాగం హెచ్చరించినట్లు సిఎన్ఎన్ - ఐబిఎన్ వార్తాకథనం తెలియజేస్తోంది.

గురునాథ్ మేయప్పన్‌ను పోలీసులు చీటింగ్, ఫోర్జరీ, ఫ్రాడ్‌ల కింద అరెస్టు చేశారు. విందూ దారా సింగ్‌కు, గురునాథ్‌కు మధ్య జరిగిన సంభాషణల వివరాలను ఆ న్యూస్ చానెల్ వెల్లడించింది. తన గురించి ఐసిసి బిసిసిఐ హెచ్చరించిందని, వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలని గురునాథ్ విందూతో అన్నట్లు ఆ చానెల్ ప్రసారం చేసిన సంభాషణలు బట్టి తెలుస్తోంది.

ఏ రోజుకా రోజు ఎంత సొమ్ము పెట్టాలి, ఇతర ఐపియల్ జట్లు ఆడుతున్న మ్యాచుల్లో ఏ ఆటగాళ్లపై పెట్టాలనే నిర్దిష్టమైన సూచనలను కూడా గురునాథ్ విందూకు ఇచ్చాడు. ఒక్క ఓవరులో నిర్దిష్టమైన పరుగులకు బెట్టింగ్ కట్టాలని కూడా సూచించాడు. ఐసిసి హెచ్చరికల గురించి ఎవరో గురునాథ్‌కు సమాచారం అందించారనే విషయం విందూతో జరిపిన సంభాషణల బట్టి తెలుస్తోంది.

ఐసిసి హెచ్చరికల గురించి తనకు ఏమీ తెలియదని బిసిసిఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అంటున్నారు. తాను రాజీనామా చేయడం లేదని కూడా ఆయన చెప్పారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శ్రీనివాసన్‌పై ఒత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే.

English summary
The International Cricket Council (ICC) had warned Indian cricket board about Gurunath Meiyappan and betting. This warning was leaked to Gurunath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X