వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనివాసన్ ఫిక్స్: అజయ్ షిర్కే, జగదలే రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

N Srinivasan
న్యూఢిల్లీ: బిసిసిఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ పూర్తిగా చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. రాజీనామాకు ఆయనపై మరింత ఒత్తిడి మొదలైంది. బిసిసిఐ కోశాధికారి అజయ్ షిర్కే, కార్యదర్శి సంజయ్ జగదలే తమ పదవులకు రాజీనామా చేశారు. ఐదుగురు బిసిసిఐ ఉపాధ్యక్షులు కూడా రాజీనామాలు చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

నైతిక బాధ్యత వహించి శ్రీనివాసన్ రాజీనామా చేయాలని షిర్కే బుధవారంనాడు డిమాండ్ చేశారు. శ్రీనివాసన్‌ను తప్పించడానికే అన్నట్లుగా జూన్ 8వ తేదీన బిసిసిఐ అత్యవసర సమావేశం జరుగుతోంది. ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం చెప్పవచ్చునని బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని బిసిసిఐ అధికారులు కొందరు అత్యవసర సమావేశం ఏర్పాటుకు డిమాండ్ చేశారు.

అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం శ్రీనివాసన్‌కు ఇష్టం లేదని అంటున్నారు. అయితే, సమావేశం ఏర్పాటు తప్పనిసరిగా మారేట్లు ఉంది. శ్రీనివాసన్ రాజీనామా చేయకపోతే రాజీనామాలు చేస్తామని షిర్కే, సంజయ్ జగదలే ఇదివరకే హెచ్చరించారు.

బిజెపి పార్లమెంటు సభ్యుడు, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఠాగూర్ - ఇది నెంబర్ గేమ్‌కు సంబంధించిన విషయం కాదని, గందరగోళం తొలగిపోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారని అన్నారు. బిసిసిఐ స్వచ్ఛంగా నడవాలని కోరుకుంటున్నామని, అందుకే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. అయితే, తాను ఏ విధమైన తప్పు చేయలేదని, తాను రాజీనామా చేయబోనని శ్రీనివాసన్ ఇప్పటికీ అంటున్నారు. కానీ, పరిస్థితులు మాత్రం ఆయనకు స్వస్తి చెప్పే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి.

English summary
Pressure is mounting on N Srinivasan to quit as president of the Board of Control for Cricket in India (BCCI) over the spot-fixing and betting scandal that has rocked Indian cricket. Ajay Shirke, the Treasurer of BCCI and its Secretary Sanjay Jagdale today resigned from their posts. Sources have told NDTV that all five vice-presidents of the BCCI are also set to quit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X