వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి వర్గం నుంచి డిల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్: మనస్తాపం

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్ : మంత్రి వర్గం నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బర్తరఫ్ చేశారు. దానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. స్వపక్షంలోనే విపక్షంలా మంత్రి ఉన్నారని, పార్టీకీ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని డిఎల్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ నరసింహన్‌కు సిఫారసు లేఖ పంపించారు. ముఖ్యమంత్రి సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొండ్రు మురళికి అప్పగించారు. మంత్రి కొండ్రు మురళి వైద్య విద్యతో పాటు వైద్య ఆరోగ్యశాఖను కూడా నిర్వహిస్తారు.

ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ డిఎల్ రవీంద్రా రెడ్డి పలుమార్లు బహిరంగ విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మరునాడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డీఎల్ పై వేటు వేయడం గమనార్హం. డీఎల్ ను తప్పించేందుకు ముఖ్యమంత్రికి అధినేత్రి సోనియాగాంధీ అనుమతి ఇచ్చారని సమాచారం. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన పి. శంకరరావును కూడా గతంలో మంత్రివర్గం నుంచి తొలగించారు.

మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై డిఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గతంలోనే తాను రాజీనామా చేశానని, రాజీనామాను ఆమోదించి ఉండాల్సిందని ఆయన అన్నారు. రవీంద్రారెడ్డి బర్తరఫ్ ఉదంతం కాంగ్రెసులో తీవ్ర సంచలనానికి దారి తీసింది. డిఎల్ బర్తరఫ్ వంటి పరిణామాలు దురదృష్టకరమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారయణ అన్నారు. ఇదిలావుంటే, త్వరలో మరో ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

మంత్రివర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేయడంపై ఆయన మద్దతుదారులు కడప జిల్లా కాజీపేటలో ఆందోళనకు దిగారు. ప్రసాద్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మైదుకూరులో డిఎల్ అనుచరులు ధర్నాకు దిగారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసు జీపు అద్దాలను పగులగొట్టారు.

English summary
In an unexpected development CM Kiran kumar Reddy has removed DL Ravindra Reddy from cabinet. Reacting to to the development DL said that his resignation submitted earlied should have been accepted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X