వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజభోగాలా: బాబుకు విజయసాయి రెడ్డి కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Vijayasai Reddy
తిరుపతి: జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించడం సరైంది కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు, జగతి పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విజయసాయి రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శనివారం తుమ్మలకుంటలోని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి హీరో తారకరత్న కూడా ఉన్నారు.

వైయస్ జగన్‌తో పాటు తాము ఎవరం కూడా ఏ తప్పూ చేయలేదని విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము నిర్దోషులుగా బయటపడుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశఆరు. తమపై సిబిఐ వద్ద ఏ విధమైన ఆధారాలు లేవని, ఇప్పటి వరకు ఏ విధమైన ఆధారాలు సంపాదించలేకపోయిందని ఆయన అన్నారు. తమపై పెట్టిన కేసులన్నీ దురుద్దేశ్యపూర్వకమైనవేనని ఆయన అన్నారు.

కొన్ని పార్టీలు కుట్రపూరితంగా తమపై కేసులు పెట్టాయని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. వైయస్ జగన్ కేసులో సిబిఐ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. సిబిఐకి స్వయంప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కేసులో అందరికీ సమన్యాయం జరగడం లేదని ఆయన అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థను నీరు గార్చడం చాలా దారుణమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు. తమ కోసం కొంత మంది మంత్రులను బలి చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యం చేస్తోందని ఆయన విమర్శించారు.

English summary

 Vijayasai Reddy, accused in YSR Congress party president YS Jagan assets case, condemned Telugudesam party president Nara Chandrababu Naidu's allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X