వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్ఫోసిస్‌లోకి నారాయణమూర్తి రీఎంట్రీ: రూపాయి జీతం

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డులోకి నారాయణ మూర్తి మళ్లీ వచ్చారు. నారాయణమూర్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. జూన్ 1వ తేదీ నుంచి నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా3, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది.

బోర్డు చైర్మన్ పదవికి 65 ఏళ్ల కెవి కామత్ రాజీనామా చేశారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణ మూర్తి స్పందించారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని ఆయన అన్నారు.

 Narayana Murthy

తనకు ఈ అవకాశం కల్పించినందుకు చైర్మన్ కెవి కామత్‌కు బోర్డుకు, ప్రతి ఇన్ఫోసిసియన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. నారాయణమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నెలకు రూపాయి జీతం తీసుకుంటారు.

సాంకేతిక పరిశ్రమ, సంస్థ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేక్‌హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని కామత్ అన్నారు. సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ సమయంలో ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.

English summary

 In a major move taken by the Information Technology (IT) giant Infosys, Narayana Murthy once again has been appointed as Executive Chairman of the company. The company in an official statement said Murthy has been re-appointed as Executive Chairman of the Board and Additional Director with effect from June 1, 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X