వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరిదాకా బేరసారాలు: ఎంపీలపై ఆజాద్ ఘాటు వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంపై కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఆదివారం ఘాటుగా స్పందించారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్, నాగర్‌కర్నూలు ఎంపి మంద జగన్నాథం, సీనియర్ నేత కె కేశవ రావు, మాజీ మంత్రి జి.వినోద్‌లు ఈ రోజు సాయంత్రం తెరాసలో చేరుతున్నారు.

దీనిపై ఆజాద్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెసు పార్టీని వీడిన వారంతా తమతో బేరసారాలు చేసే వెళ్లారన్నారు. పార్టీని వీడిన వారు బంధువులు, కుటుంబ సభ్యుల కోసమే వెళ్లారన్నారు. వారికి తెలంగాణ కంటే తమ వాళ్ల ప్రయోజనాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు ఓపిక పట్టాలన్నారు.

పార్టీని వీడిన వారికి తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారు ఇంకెవరు పార్టీని వీడరని ఆయన చెప్పారు. తెలంగాణపై ఈ నెలలోనే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ చెప్పారు. కుటుంబ ప్రయోజనాల కోసం పార్టీని వీడటం శోచనీయమన్నారు.

రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమన్వయం ఉండేలా అనేక చర్యలు చేపట్టినట్లు ఆజాద్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రకు చెందిన వారైనా ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని సమావేశాలు నిర్వహించి ఈ నెలలోనే తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించామని చెప్పారు.

ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీలు

ఆజాద్ వ్యాఖ్యల పైన ఎంపీలు వివేక్, మంద జగన్నాథం స్పందించారు. తాము ఏం బేరసారాలాడామో ఆజాద్ చెప్పాలన్నారు. వారమంటే ఏడు రోజులు, నెలంటే ముప్పై రోజులు కాదన్న ఆజాద్ తాజా గడువుకు ఎన్నిరోజులో చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చిన మాటను తప్పినందువల్లే తాము తెరాసలో చేరుతున్నామని మంద జగన్నాథం అన్నారు.

English summary
Congress Party AP incharge Ghulam Nabi Azad make 
 
 serious comments on MPs Vivek, Manda Jagannadham, 
 
 who are leaving Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X