వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేయలేదు: విజయసాయిరెడ్డి, పార్టీ బాధ్యతలపై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తాను శ్రీవారిని కోరుకున్నానని ఆడిటర్ విజయ సాయి రెడ్డి ఆదివారం అన్నారు. టిడిపి నేత, హీరో నందమూరి తారకరత్న, సాయి కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శనివారం వారు తుమ్మల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయ సాయి మాట్లాడుతూ... ప్రభుత్వం కనుసన్నుల్లోనే సిబిఐ, ఈడి కొందరిపై రాజకీయంగా కక్ష సాధించేందుకు కేసులు నమోదు చేస్తున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను, మంత్రులను బలి చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

సిబిఐ అధికార పార్టీలో పావుగా ారిందని, రెండు నెలలకే పూర్తి చేయాల్సిన ఛార్జీషీట్ ప్రక్రియను రెండేళ్లుగా పొడిగిస్తూ తమను మానసిక క్షోభకు గురి చేస్తోందన్నారు. తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఎక్కడా లేవన్నారు. సిబిఐ, ఈడి వద్ద తప్పు చేసినట్లు ఆధారాలు లేవని, త్వరలోనే నిర్దోషులుగా బయటకు వస్తామన్నారు. తన రాజకీయ ఆరంగేట్రంపై ప్రశ్నకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు.

కాగా, విజయ సాయి రెడ్డి తన భార్య తరఫు బంధువు అని, అందుకే తాను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వచ్చానని హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న అన్నారు. రాజకీయాలు వేరు.. కుటుంబం వేరన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫునే ప్రచారం చేస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత నందమూరి బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేసేందుకు సిద్ధమని తారక రత్న ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు.

English summary
Nandamuri hero Tarakaratna visited Tirumala 
 
 Venakateswara Swami temple along with Vijayasai 
 
 Reddy's family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X