వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదు: షకీల్ అహ్మద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Shakeel Ahmad
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ ప్రతిస్పందించారు. కాంగ్రెసు పార్టీ చిన్న రాష్టాలకు వ్యతిరేకంగా కాదని, అదే సమయంలో తెలంగాణకు కూడా వ్యతిరేకం కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నందు వల్లనే రాష్ట్ర ఏర్పాటుకు ఆలస్యమవుతోందని అన్నారు.

తెలంగాణ సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం పడుతుందని షకీల్ అహ్మద్ అన్నారు. తెలంగాణపై చర్చలు సాగుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలుసాగుతున్నాయని, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తెలంగాణపై ఏకాభిప్రాయ సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలను ఆజాద్ మాత్రమే వివరించగలరని ఆయన అన్నారు. పూర్తి వివరాలు ఆజాద్‌కు మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా - ఎంపీల వ్యవహారంపై ఆజాద్ పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పిస్తారని ఆయన జవాబిచ్చారు.

తెలంగాణకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, జి. వివేక్‌తో పాటు సీనియర్ నేత కె. కేశవ రావు తెరాసలో చేరిన నేపథ్యంలో తెలంగాణపై ఎఐసిసికి చెందిన నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. నెల రోజుల్లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ ఆదివారం చెప్పారు. సోమవారం షకీల్ అహ్మద్ తాము తెలంగాణకు వ్యతిరేకం కాదనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించారు.

English summary
AICC spokesperson Shakeel Ahmad said that Congress is not against small states, including Telangana. He said that talks are going on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X