వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ రిమాండ్ పొడిగింపు: లొంగిపోనున్న సాయి రెడ్డి

వైయస్ జగన్మోహన్ రెడ్డిని, గాలి జనార్ధన్ రెడ్డిని, మోపిదేవి వెంకటరమణను, నిమ్మగడ్డ ప్రసాద్‌లను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. అనంతరం వారి రిమాండును రెండు వారాలపాటు పొడిగించింది. జగన్ కేసు వాన్‌పిక్ అంశంలో హాజరు కావాల్సిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనని కోర్టుకు తెలిపారు.
5న విజయ సాయి లొంగుబాటు!
జగన్ ఆస్తుల కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయ సాయి రెడ్డి ఈ నెల 5న సిబిఐ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. బెయిల్ పైన ఆయన విడుదలయ్యారు. దీంతో అతని బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ సుప్రీం కోర్టుకు వెళ్లింది. బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది.
తన కూతురు పెళ్లి ఉన్నందున విజయ సాయి రెడ్డికి సుప్రీం కోర్టు ఈ నెల 5వ తేది వరకు లొంగిపోయేందుకు అనుమతిని ఇచ్చింది. దీంతో బుధవారం ఆయన కోర్టులో లొంగిపోయే అవకాశముంది.