వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ విషయం కోర్టు తేలుస్తుంది: కోట్ల, డిఎల్‌పై స్పందన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotla Surya Prakash Reddy
రాజమండ్రి/కర్నూలు: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదరణ తగ్గిందని, తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెసు గెలుపును ఏ శక్తి ఆపలేదని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆదివారం కర్నూలు జిల్లాలో అన్నారు.

కొందరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు కోర్టులో రుజువు కాలేదని చెప్పారు. అలాంటి అభియోగాలు అన్ని పార్టీల నేతల పైన ఉన్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చే విషయం న్యాయస్థానం తేలుస్తుందన్నారు.

డిఎల్ రవీంద్రా రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం సరికాదని, అదీ అయన విదేశీ పర్యటనలో ఉండగా ఇలా చేయడం సబబు కాదని కేంద్ర రైల్వే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డిఎల్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సంప్రదింపులు జరిపి బర్తరఫ్ చేసి ఉండాల్సిందని మంత్రి కోట్ల వ్యాఖ్యానించారు. బర్తరఫ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయమన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు కె కేశవ రావు, ఎంపీలు మందా జగన్నాథంలకు 'సన్' స్ట్రోక్ తగలడం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ ఆదివారం ఎద్దేవా చేశారు. కొడుకుల కోసమే వారు జంప్ చేశారన్నారు.

English summary

 Central Minister Kotla Surya Prakash Reddy said CM Kiran kumar Reddy should have secured DL Ravindra Reddy's resignation instead of sacking him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X