వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసిసిఐ సమావేశంపై ఆసక్తి: టీవీలో చూసిన శ్రీశాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ: చెన్నైలో ఆదివారం జరిగిన బిసిసిఐ అత్యవసర సమావేశం వివరాల కోసం స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్, అజిత్ చండిల టీవిలో చూశారట. తీహార్ జైలులోని ఒకటో నెంబర్ సెల్‌లో బిసిసిఐలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో జరిగిన బిసిసిఐ సమావేశాన్ని టీవీలో చూశారని అధికారులు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

శ్రీశాంత్, అజిత్ చండిల ఆదివారంనాడు బిసిసిఐ అత్యవసర సమావేశం వివరాలను తెలుసుకోవడానికి టీవీకి అతుక్కుపోయారని చెబుతున్నారు. శ్రీశాంత్ ప్రతి రోజూ వార్తాపత్రికలు చదువుతున్నాడని సమాచారం. ఇద్దరు కూడా అలజడి లేకుండా ఉంటున్నారని, శ్రీశాంత్ మరీ మౌనంగా ఉంటున్నాడని జైలు అధికారులు చెప్పారు.

శ్రీశాంత్, అజిత్ చండిల పరిస్థితులకు సర్గుకుంటున్నారని, శ్రీశాంత్ అత్యంత ఆసక్తిగా వార్తాపత్రికలు చదువుతున్నాడని అంటున్నారు. శ్రీశాంత్ ఐదు కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అరెస్టయినప్పటి నుంచి లో బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నాడని చెబుతున్నారు. అన్న దీపు సింగ్ శ్రీశాంత్‌ను జైలులో కలిశాడు. అప్పటి నుంచి ఆయనను ఎవరూ కలవలేదు.

కాగా, స్పాట్ ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను పోలీసులు మే 16వ తేదీన అరెస్టు చేశారు. వివాహం చేసుకోవడానికి అంకిత్ చవాన్‌కు కోర్టు ఈ నెల 6వ తేదీ వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

English summary
Sreesanth and his RR teammate Ajit Chandila, who were arrested by Delhi Police for their alleged involvement in the Indian Premier League spot fixing scandal, have been following the crisis in Indian cricket administration on television from their Tihar Jail cell No 1," according to media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X