వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ లడాయి'తో వస్తా: అజిత్, తేల్చమన్నా: జానా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy and Ajit Singh
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ సంప్రదింపులు అంశాన్ని తాను మీడియాలోనే చూశానని అజిత్ సింగ్ మంగళవారం అన్నారు. తెలంగాణ అంశాన్ని తాము సమన్వయ కమిటీలో లేవనెత్తామన్నారు. ఈ నెల 7 నుండి తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు. తెలంగాణ లడాయి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రచారం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై ఆ ప్రాంత ప్రజలకు మాటలు కాకుండా చేతలు కావాలన్నారు.

తెలంగాణ తేల్చాలని కోరా: జానా రెడ్డి

సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశంపై తేల్చాలని తాను కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌ను కోరినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి మంగళవారం చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాట్లాడేందుకు ఆజాద్ తనను రమ్మన్నారన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆజాద్‌కు చెప్పానన్నారు. ఈసారి ఎస్సీ, ఎస్టీలకు అధికంగా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

నాగం తొందరపాటు: పొంగులేటి

నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి తొందరపాటులో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయనకు అతి త్వరలో బిజెపి రంగు తెలుస్తుందన్నారు. త్వరగా తెలంగాణపై ప్రకటన చేయాలని తాను కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిసినట్లు చెప్పారు.

గంగుల కమలాకర్ పై అనర్హత పిటిషన్

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాల చారి ఈ రోజు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. వారి అనర్హత పిటిషన్‌ను స్పీకర్ వాయిదా వేశారు. ఇటీవలె తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన గంగుల కమలాకర్ పైన టిడిపి అనర్హత పిటిషన్ ఇచ్చింది.

ఢిల్లీకి దామోదర

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అంశంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ పై అధిష్టానంతో చర్చించే అవకాశాలున్నాయి. సబితా ఇంద్రా రెడ్డి స్థానంలో హోంమంత్రి పదవిని ఆయన కోరే అవకాశాలు ఉన్నాయి.

English summary
RLD chief Ajit Singh said that he will campaign for TRSl in local body elections with the name of Telangana Ladai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X