వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు: శ్రీనివాసన్‌కు కొత్త కష్టాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో త్వరలో మరో చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసింది. ఇండియా సిమెంట్స్ అధినేత, ఇటీవలి ఐపిఎల్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్న బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై అభియోగాలు మోపే అవకాశాలు ఉన్నాయి. దాల్మియా చార్జిషీట్‌లో ఆ సంస్థ పైన, సంస్థ యజమానిపైనా ఐపిసి సెక్షన్ల కింద సిబిఐ అభియోగాలు మోపింది.

అదే క్రమంలో ఇండియా సిమెంట్స్ యజమాని శ్రీనివాసన్‌పై అభియోగాలు మోపే అవకాశం ఉంది. అలాగే ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులు చేసినందుకు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఐటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య పైనా అభియోగాలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో మరిన్ని చార్జిషీట్లు వేస్తామని సిబిఐ చెబుతున్నందున తొలి చార్జిషీట్‌పై విచారణ మొదలు పెట్టడం చట్టసమ్మతం కాదని జగతి ఆడిటర్ విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ నాంపల్లి సిబిఐ కోర్టుకు చెప్పారు. ఏ కేసులోనైనా దర్యాప్తు అంతా పూర్తయ్యాకే విచారణ ప్రారంభమవుతుందన్నారు.

అక్రమాస్తుల కేసులో దాఖలైన అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారణ జరపాలని కోరుతూ వైయస్ జగన్, సాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం వాదనలు జరిగాయి. అయితే సిబిఐ గడువు కోరడంతో కేసు 5వ తేదీకి వాయిదా పడింది.

English summary

 The CBI is all set to name beleaguered BCCI chief N. Srinivasan as an accused in the India Cements conspiracy in the YS Jaganmohan Reddy quid pro quo investments case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X