వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూజలు, ఉపవాసాలతో లక్ పరీక్షించుకుంటున్న శ్రీశాంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కేరళ పేసర్ శ్రీశాంత్ ఇప్పుడు తన అదృష్టాన్ని దేవుడి ద్వారా పరీక్షించుకుంటున్నాడట. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. అతనికి మంగళవారం ఢిల్లీలోని సాకేత్ కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. గతంలోను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకన్నప్పటికీ రాలేదు.

బెయిల్‌తో పాటు స్పాట్ ఫిక్సింగ్ కేసులో బయట పడేందుకు శ్రీశాంత్ ఇప్పుడు దేవుళ్లను ఆశ్రయిస్తున్నారట. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం... శ్రీశాంత్ జైలులో ఉపవాసం ఉంటున్నాడు. నిత్యం పలువురు దేవుళ్లకు పూజలు చేస్తున్నాడు.

శ్రీశాంత్ జైలులో పలువురు దేవుళ్లకు మొక్కుకుంటున్నాడని, తాను ఎలాంటి తప్పు చేయలేదని తోటి ఖైదీలకు కూడా చెబుతున్నాడని జైలు అధికారులు చెప్పినట్లుగా పేర్కొంది. అంతేకాకుండా అతను జైలుకు వచ్చినప్పటి నుండి షేవింగ్ కూడా చేసుకోలేదని, రోజుకు ఒకపూటే భోజనం చేస్తున్నాడని చెప్పారట.

శ్రీశాంత్ తన సాధారణ జీవన శైలికి పూర్తి భిన్నంగా ఉంటున్నాడని, స్నేహితులు లేగుండా గడుపుతున్నాని, ఎందులోను కల్పించుకోవడం లేదని, ఫిక్సింగ్ విచారణ పట్ల ఆవేదనతో ఉన్నాడని అధికారి చెప్పినట్లుగా పేర్కొంది. శ్రీశాంత్ నెర్వస్‌గా కనిపించడం లేదా ఒంటరిగా నీడలో డల్‌గా కూర్చుంటున్నాడని పేర్కొంది. అరెస్టైన తర్వాత శ్రీశాంత్ ఎనిమిది కిలోలు తగ్గాడు.

English summary

 30-year-old pace bowler from Kerala -- S Sreesanth has landed in a serious legal trouble over his alleged role in IPL spot fixing scandal. The cricketer, who currently is being lodged in Tihar jail, seems to have been trying to fix his luck after impressing god.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X