వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బన్సల్‌ను మూడు గంటలు ప్రశ్నించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Pawan Bansal
న్యూఢిల్లీ: రైల్వేలో అవినీతి కుంభకోణంపై సిబిఐ అధికారులు మాజీ కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సల్‌ను మంగళవారం ప్రశ్నించారు. ఆయనను సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంచం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని బన్సల్ చెప్పారు. తన మేనల్లుడితో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు.

రైల్వే బోర్డులో ఉన్నత పదవి కోసం బన్సల్ మేనల్లుడు 90 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం డీల్ విలువ పది కోట్ల రూపాయలని సిబిఐ అధికారులు అంటున్నారు. మొదటి విడతగా బన్సల్ అల్లుడు విజయ్ సింగ్లా డబ్బులు తీసుకుంటుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు.

విజయ్ సింగ్లా మహేష్ కుమార్ అనే వ్యక్తిని ఢిల్లీలోని బన్సల్ అధికారిక నివాసంలో మొదటిసారి కలిశాడని, బన్సల్ కుమార్‌ను ముంబైలో ఏప్రిల్‌లో కలిశారని, రైల్వే బోర్డులో నియమిస్తామని హామీ ఇచ్చారని సిబిఐ అధికారులు అంటున్నారు. కుమార్‌కు, బన్సల్ అల్లుడికి మధ్య జరిగిన వేయి ఫోన్ కాల్స్‌ను సిబిఐ అధికారులు పరిశీలించారు.

ఈ కుంభకోణం వెలుగు చూడడంతో పవన్ కుమార్ బన్సల్ తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేయడానికి మొదట నిరాకరించిన బన్సల్ ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో దిగి వచ్చారు.

English summary
Pawan Kumar Bansal, who was forced to resign last month as Railways Minister after a corruption scandal, is being questioned by the CBI in Delhi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X