వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పాట్ ఫిక్సింగ్: గురు, విందులకు బెయిల్ మంజూరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gurunath Meiyappan - Vindoo
న్యూఢిల్లీ/ముంబై: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ సిఈవో గురునాథ్ మీయప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లకు మంగళవారం బెయిల్ లభించింది. వీరితో పాటు మరో ఆరుగురికి బెయిల్ వచ్చింది. రోజు తప్పించు రోజు పోలీసుల ఎదుట హాజరు కావాలని, దేశం విడిచి వెళ్లిపోవద్దనే షరతులతో కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.

అంతకుముందు ముంబై కోర్టు విందూ, గురునాథ్ బెయిల్ పిటిషన్‌లను మంగళవారానికి వాయిదా వేసింది. వారికి ఈ నెల 14వ తేది వరకు జ్యూడిషియల్ కస్టడీని విధించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తమకు రిమాండు విధించిన తర్వాత మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండిలా సహా పన్నెండు మంది బెయిల్ పిటిషన్‌లను ఢిల్లీ సాకేత్ కోర్టు మంగళవారం విచారించనుంది. శ్రీశాంత్‌ను జూన్ 5వ తేది వరకు తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు తోసిపుచ్చింది.

రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ చేసిన అంకిత్ చవాన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. అంకిత్ తాత్కాలిక బెయిల్ పైన విడుదలై రెండు రోజుల క్రితం స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇతను ఈ నెల 6వ తేదిన ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. దీంతో అతను బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు తోసి పుచ్చింది.

English summary

 Chennai Super Kings (CSK) team principal Gurunath Meiyappan, small-time actor Vindoo Dara Singh and others who are involved in spot-fixing scandal, have been granted bail on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X