వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే సిఎంనైతే: అఖిలేష్‌కు ములాయం మళ్లీ మొట్టికాయ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav - Mulayam Singh Yadav
లక్నో: తన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పని తీరు పైన సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో లక్నోలో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా అయి ఉంటే పదిహేను రోజుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దేవాడిని చెప్పారు. అఖిలేష్ యాదవ్ పని తీరు బాగాలేదని చెప్పారు.

శాంతిభద్రతల విషయంలో అఖిలేష్ విఫలమయ్యారన్నారు. సరిగ్గా పని చేయని జిల్లా స్థాయి అధికారులను దారిలోకి తేవాల్సి ఉందన్నారు. పని చేయకుంటే జైలుకు పంపాలని హితవు పలికారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెట్టి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లా ప్రశంసలు అందుకోవాలంటే అందుకు కేవలం పదిహేను రోజులు చాలన్నారు. అఖిలేష్‌కు పాలన విషయంలో తానెప్పుడు అడ్డు తగలలేదన్నారు.

సలహాలు, సూచనలు మాత్రమే చేశానన్నారు. యూపిఏ 2 వార్షిక విందుకు ఇటీవల ఆయన హాజరు కాలేదు. దీనిపై మాట్లాడుతూ... యూపిఏలో లేనప్పుడు అలాంటి విందులకు హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పారు. ములాయం గతంలోను ఒకటి రెండుసార్లు తన తనయుడి పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతేడాది అఖిలేష్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ములాయం సింగ్ యాదవ్ పలు సూచనలు చేశారు. తీరు మార్చుకోవాలని చెప్పారు. మీ పని తీరు బాగోలేదని, ఇలాగైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు సాధించలేదమని, ఇప్పటికైనా గాడిన పడాలని సొంత ప్రభుత్వానికే ములాయం సింగ్ హెచ్చరికలు చేశారు. ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి ప్రతిష్ఠను పెంచే చర్యలు చేపట్టాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలని సూచించారు.

మంగళవారం రాత్రి పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సమక్షంలోనే ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్.. తన పాలనపై మొదటిసారిగా, అదీ తన తండ్రి నుంచే విమర్శలు ఎదురుకావడంతో.. అప్పుడు ఏమీ చెప్పలేకపోయారు. మొత్తానికి తండ్రి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ములాయం అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, పొరపాట్లు ఉంటే దిద్దుకుంటామని అఖిలేశ్ చెప్పారు. బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ స్పందించినప్పుడు కూడా అఖిలేష్ పైన ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
SP chief Mulayam Singh Yadav on Tuesday said had he been in place of the Chief Minister, he would have changed perception of law and order in the state within 15 days and advised Akhilesh not to hesitate in sending errant officers to jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X