వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు: ఏడ్చేసిన శ్రీశాంత్ తల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreesanth
కొచ్చి: ఐపియల్ కుంభకోణంపై మాట్లాడుతూ మాట్లాడుతూ శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి ఏడ్చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్ తల్లిదండ్రులు బుధవారం ఆ విషయంపై మాట్లాడారు. తమ కుమారుడు అమాయకుడని, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంతో అతనికి ఏ విధమైన సంబంధం లేదని వారన్నారు.

తమ కుమారుడు ఈ విధమైన తప్పు చేస్తాడని అనుకోవడం లేదని, మైదానంలో అతిగా ప్రవర్తించి ఉండవచ్చునని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తాము ఎవరినీ నిందించదలుచుకోలేదని శ్రీశాంత్ తల్లి సావిత్రీదేవి అంటూ కంటతడి పెట్టుకున్నారు. తన తల్లికీ తనకు వచ్చిన కష్టం రాకూడదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు.

తన కుమారుడి కెరీర్‌ను నాశనం చేయడానికి ఏదైనా పెద్ద శక్తి పని చేసి ఉండవచ్చునని శ్రీశాంత్ తండ్రి శాంతకుమారన్ నాయర్ అన్నారు. నిన్న ఏం జరిగిందో చూడండి, బెయిల్ పొందడానికి అన్నీ పూర్తయ్యాయని, అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు కొత్త సెక్షన్లతో ముందుకు వచ్చారని ఆయన అన్నారు. ప్రతిదీ మిస్టరీగానే కనిపిస్తోందని ఆయన అన్నారు.

శ్రీశాంత్‌పై ఢిల్లీ పోలీసులు మోకాను ప్రయోగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపియల్ ఆడిన శ్రీశాంత్‌ను స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీసులు గత నెల 16వ తేదీన అరెస్టు చేశారు. శ్రీశాంత్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది.

English summary
"We don't think that our son would do a wrong like this...maybe on the field he would have shown his exuberance. We have full faith in the judiciary and we do not blame anyone," said Sreesanth's mother Savithiri Devi, with tears in her eyes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X