వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంద్రా చాలా మంచోడు, బుకీలను పట్టుకోండి: విందూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vindu Dara Singh
ముంబై: తాను నిర్దోషినని బెట్టింగ్ కేసులో అరెస్టయి బెయిల్ మీద విడుదలైన బాలీవుడ్ నటుడు దారా సింగ్ మరోసారి అన్నాడు. బెట్టింగు కుంభకోణంతో తనకు సంబంధాలున్నట్లు పోలీసుల వద్ద ఏ విధమైన ఆధారాలు లేవని ఆయన గురువారంనాడు అన్నాడు. పోలీసులు మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా అడిగితే లేదని చెప్పాడు.

పోలీసులు తననెందుకు ఇరికిస్తారని, తాను ఏ నేరమూ చేయలేదని, తాను ఏ తప్పూ చేయలేదని, వారికి నిజం తెలియాల్సి ఉందని, వారికి నిజం తెలిస్తే తనను వదిలేస్తారని విందూ దారాసింగ్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా గురించి అడిగినప్పుడు అతను మంచి మనిషి అని, తనకు అతను బాగా తెలుసునని విందూ జవాబిచ్చాడు.

తన జట్టు ఆడుతున్నప్పుడు తన జట్టు గెలుస్తుందని ఎప్పుడూ అనడని ఆయన చెప్పాడు. భారతదేశంలో కోట్లాది మంది బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని, దేశంలో బెట్టింగ్‌ను ఆపాలంటే బుకీలను పట్టుకోవాలని, బెట్టింగ్ కట్టేవారిని కాదని ఆయన అన్నాడు.

ఐపియస్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగు కుంభకోణంలో విందూ దారా సింగ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రిన్సిపాల్ గురునాథ్ మేయప్పన్ అరెస్టయ్యారు. ఆ తర్వాత ఇద్దరు కూడా మంగళవారంనాడు బెయిల్‌పై విడుదలయ్యారు.

English summary

 Actor Vindu Dara Singh, who is out on bail in the IPL spot-fixing scandal, on Thursday claimed innocence saying that the police have no evidence to link him with the betting scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X