వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీకి ఎందుకెళ్లానా?: శ్రీశాంత్‌తో డ్యాన్స్‌పై నటి సంజన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjana condemns allegations
బెంగళూరు: స్పాట్ ఫిక్సింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి సంజన చెప్పారు. ఫిక్సింగ్ కేసులో అరెస్టైన పేసర్ శ్రీశాంత్‌కు సంజన స్నేహితురాలు కావడంతో ఆమెను పోలీసులు విచారించే అవకాశాలున్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఓ టివి ఛానల్‌తో మాట్లాడారు.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో తనపై ఎలాంటి ఆరోపణలు లేవని, అదంతా వట్టి ప్రచారం మాత్రమేనన్నారు. తన తండ్రి కూడా ముంబై, ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి, తన పేరు ఉందా అని అడిగితే లేదని చెప్పారన్నారు. శ్రీశాంత్‌తో తాను 2009లో ఒకటి రెండు నెలలు మాత్రమే స్నేహం చేశానన్నారు.

తమ స్నేహం ఎంత క్యాజువల్‌గా అయిందో అంతే క్యాజువల్‌గా విడిపోయామన్నారు. శ్రీశాంత్‍‌తో కలిసి తాను 2009లోనే ఓ పార్టీలో కాసేపు డ్యాన్స్ చేశానని, అప్పటి ఫోటోలను ఓ కన్నడ టివి ఛానల్ ఇప్పుడు బయటకు తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలతో తాను, తన కుటుంబం చాలా బాధపడ్డామన్నారు.

అప్పట్లో శ్రీశాంత్‌తో తనది కేవలం ఫ్రెండే షిప్ మాత్రమేనన్నారు. తామిద్దరం కలువడం వల్ల పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగిందన్నారు. ఇప్పుడు తాను ఆ పార్టీకి ఎందుకు వెళ్లానా, ఎందుకు డ్యాన్స్ చేశానా అని బాధపడుతున్నానన్నారు. తాను సెలబ్రిటీ కాబట్టి ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల సిసిఎల్ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్‌తో కనిపించడంపై స్పందిస్తూ... అతనికి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందనే విషయం అందరికీ తెలుసునని, ఇటీవల సిసిఎల్ మ్యాచ్ సందర్భంగా కలిసినప్పుడు కేవలం పలకరింపుకే పరిమితమయ్యామని చెప్పారు. పోలీసులు విచారణకు పిలిస్తే తాను పూర్తిగా సహకరిస్తానన్నారు.

English summary

 Actor Sanjana has condemned allegations against her in spot fixing case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X