వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబిత కన్నీరు, జగన్ హుషారు: పోలీస్‌పై భారతి చేయి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Sabitha Indra Reddy
హైదరాబాద్: మాజీ హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి శుక్రవారం కంటతడి పెట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి దాల్మియా కేసులో జగన్, సబిత తదితరులు ఈరోజు కోర్టులో హాజరయ్యారు. సబితా నిందితురాలిగా మొదటిసారి కోర్టుకు హాజరయ్యారు. ఆమె ముభావంగా కనిపించారు. ఆమె ఎవరితోను మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు.

జగన్ తనను పలకరించినప్పుడు కూడా కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత పలకరించారు. కోర్టులో ఆద్యంతం ఆమె ముభావంగానే కనిపించారు. అనంతరం సిబిఐ కోర్టులో తమ జ్యూడిషయల్ కస్టడీకి మెమో దాఖలు చేయడంతో, ఆ విషయం తెలిసిన సబితా ఇంద్రా రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.

జైలుకు జగన్

కోర్టులో విచారణ అనంతరం జగన్ తన కుటుంబ సభ్యులతో గంట పాటు మాట్లాడారు. అనంతరం ఆయనను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరిగి జైలు అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా అంతకుముందు జగన్ సతీమణి భారతి ఓ పోలీసుపై చేయి చేసుకున్నట్లుగా స్క్రోలింగ్స్ వస్తున్నాయి.

హుషారుగా జగన్

జగన్ హుషారుగా కనిపించారు. వాహనం కోర్టు ప్రాంగణానికి వచ్చిన వెంటనే ఆయన నవ్వుతూ అందులో నుండి దిగారు. అందర్నీ పలకరించే ప్రయత్నాలు చేశారు. న్యాయవాదులను, సబితా ఇంద్రా రెడ్డిని, మీడియా ప్రతినిధులను అందర్నీ పలకరించారు. విజయమ్మను ఆలింగనం చేసుకున్నారు. విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చారు. ఆరు నెలల తర్వాత జగన్ జైలు గోడలు దాటారు. గతేడాది డిసెంబర్లో ఆయన కోర్టుకు హాజరైన తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చారు.

కెవిపిని అరెస్టు చేయాలంటూ...

రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును అరెస్టు చేయాలంటూ పలువురు న్యాయవాదులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. కెవినిపి అరెస్టు చేసి ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. వైయస్ హయాంలో ఆయనే చక్రం తిప్పారన్నారు.

English summary
Former Minister Sabitha Indra Reddy wept for CBI' Memo against her judicial custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X