వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపిఏను మళ్లీ గెలిపిస్తే తెలంగాణ: ఇదీ అజిత్ మాట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajit Singh
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్రంలో మరోసారి యూపిఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే తెలంగాణ రావడం ఖాయమని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ శుక్రవారం అన్నారు. 2014 ఎన్నికల లోపు తెలంగాణ రాదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆ తర్వాత ఏ ప్రభుత్వం గెలిచినా తెలంగాణ మాత్రం ఇవ్వక తప్పదన్నారు. యూపిఏని మళ్లీ గెలిపిస్తే తెలంగాణ ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

తెలంగాణకు యూపిఏలోని భాగస్వామ్యపక్షాలు అనుకూలంగా ఉన్నాయని, ఢిల్లీలో సమన్వయం లేకే ఆలస్యమవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రజలే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ పోటీ చేస్తుందని చెప్పారు.

కెసిఆర్‌పై దిలీప్ కుమార్

తెలంగాణ రాష్ట్ర సమితి 15 పార్లమెంటు స్థానాలలో గెలిస్తే తెలంగాణ తెస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని టిఆర్ఎల్డీ నేత దిలీప్ కుమార్ అన్నారు. తెరాస 17 స్థానాలలో గెలిచినా తెలంగాణ రాదన్నారు. తెలంగాణ కేవలం జాతీయ పార్టీలతోనే సాధ్యమన్నారు. జాతీయ పార్టీల మద్దతు లేకుండా ప్రత్యేక రాష్ట్రం సాధించలేమన్నారు. స్థానికంలో తాము పోటీ చేస్తామన్నారు.

మాట తప్పితే మచ్చ: పొన్నం

తెలంగాణపై ఇచ్చిన మాటను తప్పితే పార్టీ చరిత్రకే మచ్చ అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. తెలంగాణను కేంద్రం ఇవ్వని పక్షంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఇచ్చిన మాటపై జాప్యమెందుకని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

చేప ప్రసాదం విషయంలో లోకాయుక్త పరిధికి మించి మాట్లాడుతోందని, కోట్లాది రూపాయల అవినీతి జరుగుతుంటే కనిపించడం లేదా అని, ప్రసాద పంపిణీ సమయంలో ఏదైనా జరిగితే లోకాయుక్తనే బాధ్యత వహించాలని పొన్నం మండిపడ్డారు.

English summary
RLD chief Ajit Singh said that Telangana state will form after 2014 general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X