వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు తేలితే కుంద్రాను తప్పిస్తాం: రాజస్థాన్ రాయల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Raj Kundra
న్యూఢిల్లీ: తప్పు చేసినట్లు రుజువైతే రాజ్ కుంద్రాను సహ యజమానిగా తప్పిస్తామని రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. ఐపియల్ ఫ్రాంచైజీని నడిపించడంలో కుంద్రాకు ఏ విధమైన సంబంధం ఉండదని స్పష్టం చేసింది. కుంద్రాకు ఫ్రాంచైజీలో కేవలం 11.7 శాతం వాటా మాత్రమే ఉందని, ఫ్రాంచైజీని నడిపించడంలో కుంద్రాకు పాత్ర లేదని చెప్పింది.

తప్పు చేసినట్లు తేలితే రాజ్ కుంద్రాను సస్పెండ్ చేస్తామని, వాటాను వెనక్కి తీసుకోవాలని సూచిస్తామని వివరించింది. కుంద్రా బెట్టింగు ఆరోపణలు ఎదుర్కున్నట్లు తెలిసిందే. రాజ్ కుంద్రా రాజస్థాన్ రాయల్స్‌పైనే బెట్టింగులు కట్టినట్లు, ఈ విషయాన్ని కుంద్రా అంగీకరించినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పిన విషయం కూడా తెలిసిందే.

తన తరఫున వాదించడానికి రాజ్ కుంద్రా ప్రముఖ న్యాయవాది మజీద్ మెమొన్‌ను నియమించుకున్నారు. తన తరఫున ప్రకటనలన్నీ మజీద్ తరఫున విడుదలవుతాయని, త్వరలో వాస్తవం బయటపడుతుందని రాజ్ కుంద్రా ట్వీట్ చేశాడు.

బ్రిటిష్ జాతీయుడైన రాజ్ కుంద్రాను పోలీసులు బుధవారం 11 గంటల పాటు ప్రశ్నించారు. కుంద్రా వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా జట్టు కూర్పు, పిచ్ సమాచారం అడుగుతుండేవాడని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ్ త్రివేది పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు కుంద్రాను ప్రశ్నించారు. రాజ్ కుంద్రాకు బెట్టింగుతో తప్ప స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం లేదని పోలీసులు చెప్పారు.

English summary
Rajasthan Royals on Friday tried to distance themselves from the co-owner Raj Kundra by claiming that the latter has no say in the running of the IPL franchise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X