వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిల్పా భర్త కుంద్రా అరెస్టును తప్పించుకుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Raj Kundra
న్యూఢిల్లీ: నటి శిల్పా శెట్టి భర్త, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా బెట్టింగుపై సాక్ష్యాలు లేవని పోలీసులు చెప్పారు. ఐపియల్‌లో కుంద్రా బెట్టింగుకు పాల్పడినట్లు అంగీకరించాడని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ చెప్పారు. అయితే, దాన్ని నిరూపించడానికి తగని సాక్ష్యాధారాలు లభించలేదని పోలీసులు అంటున్నారు. దీంతో రాజ్ కుంద్రా విషయంలో ఏం చేయాలనే మీమాంసలు పోలీసులు పడ్డారు.

కుంద్రాను పోలీసులు అరెస్టు చేయవచ్చుననే వార్తలు వచ్చినప్పటికీ తగిన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేస్తే ఇబ్బందుల్లో పడుతామనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కుంద్రాపై ఆధారాలు లభించలేదని, దాంతో ఆయనను అరెస్టు చేయలేమని నీరజ్ కుమార్ శుక్రవారం టీవీ చానెళ్లతో చెప్పారు.

తన మిత్రుడు, వ్యాపార భాగస్వామి ఉమేషథ్ గోయంకా ద్వారా కుంద్రా బెట్టింగుకు పాల్పడ్డాడని, బెట్టింగులో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడని ఆయన గురువారంనాడు చెప్పారు. ఉమేష్ గోయంకా బుకీగా వ్యవహరించాడు.

తాను నిర్దోషినని కుంద్రా శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ వాటాదారుడిగా ఢిల్లీ పోలీసు దర్యాప్తు బృందానికి తనను విచారించే హక్కు ఉందని, చట్టానికి కట్టుబడే పౌరుడిగా తాను విచారణకు హాజరయ్యానని, పోలీసులు వేసిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చానని, విచారణ తర్వాత వెళ్లిపోవడానికి తనను అనుమతించారని ఆయన వివరించారు.

కుంద్రాకు బెట్టింగుతో సంబంధం ఉన్నప్పటికీ స్పాట్ ఫిక్సింగ్‌‍తో మాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కుంద్రాను మరోసారి విచారణకు పిలుస్తామని కూడా పోలీసులు అంటున్నారు. కుంద్రా సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయిన విషయం తెలిసిందే.

English summary
Just 24 hours after police commissioner Neeraj Kumar was on the national networks claiming Kundra had confessed to betting in the IPL games, the police are undecided on what to do with the Rajasthan Royals part owner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X