వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్త్ డే గిఫ్ట్: శిల్పా శెట్టికి రాజ్ కుంద్రా క్షమాపణలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shilpa Shetty and Raj Kundra
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని శిల్పా శెట్టికి ఆమె భర్త రాజ్ కుంద్రా క్షమాపణలు చెప్పారు. శనివారం శిల్పా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆయన క్షమాపణలతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన క్షమాపణలను పోస్టు చేశారు. శిల్పా శెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు ఆయన కృతజ్ఝతలు తెలిపారు.

"నా ప్రియమైన భార్య శిల్పా శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు. నీపై వస్తున్న ఆరోపణలపై క్షమాపణలు చెబుతున్నా. వాస్తవం త్వరలోనే బయటపడుతుంది" అని ఆయన ఐపియల్ బెట్టింగ్ ఆరోపణలను ఉద్దేశించి అన్నారు. ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఆందోళనకు గురైన స్థితి వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెట్ అజింక్యా రహనే కూడా శిల్పా శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాను నిర్దోషినని కుంద్రా శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ వాటాదారుడిగా ఢిల్లీ పోలీసు దర్యాప్తు బృందానికి తనను విచారించే హక్కు ఉందని, చట్టానికి కట్టుబడే పౌరుడిగా తాను విచారణకు హాజరయ్యానని, పోలీసులు వేసిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చానని, విచారణ తర్వాత వెళ్లిపోవడానికి తనను అనుమతించారని ఆయన వివరించారు.

కుంద్రాకు బెట్టింగుతో సంబంధం ఉన్నప్పటికీ స్పాట్ ఫిక్సింగ్‌‍తో మాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కుంద్రాను మరోసారి విచారణకు పిలుస్తామని కూడా పోలీసులు అంటున్నారు. కుంద్రా సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయిన విషయం తెలిసిందే.

English summary

 RR co-owner Raj Kundra wished his wife Shilpa Shetty a happy birthday and apologised for the disturbing events that saw them being dragged into the IPL spot-fixing scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X