హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్‌లో రాత్రి యువతి పట్ల 'మెగా' హీరో అసభ్య ప్రవర్తన?

By Srinivas
|
Google Oneindia TeluguNews

girl
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ముగ్గురు యువకులు ఓ మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో అర్ధరాత్రి న్యూఢిల్లీకి చెందిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అమె డిజెగా ఉంటున్నారు.

బాధిత యువతి అప్పుడే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తన పట్ల పబ్‌లో ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిలో ఓ యువ హీరో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మద్యం మత్తులో వారు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. యువ హీరో ఉండటం, పెద్దవారు కావడంతో కేసు లేకుండా రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందుకోసం పైస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు.

ఆ యువ హీరో అల్లు శిరీషా?

కాగా పబ్‌లో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులలో ఉన్న ఆ యువ హీరో అల్లు శిరీష్ అని తెలుగు టీవి ఛానళ్లలో ప్రసారం అవుతోంది.

English summary
Young girl was abused by three youth in Hyderabad on 
 
 Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X