వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను చూసి నేర్చుకోవాలి: దగ్గుబాటిపై టిఎస్సార్

By Pratap
|
Google Oneindia TeluguNews

T Subbirami Reddy and Daggubati Venkateswar Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. భార్య దగ్గుబాటి పురంధేశ్వరిని చూసి దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంస్కారం నేర్చుకోవాలని టిఎస్సార్ అన్నారు. తెలుగుదేశం, బిజెపిల నుంచి వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వర రావే అలా మాట్లాడితే 30 ఏళ్లు కాంగ్రెసు పార్టీలో ఉన్న తాను ఎలా మాట్లాడాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో తనకు ఏ విధమైన శత్రుత్వం లేదని, తన పరువు తీసేందుకు ప్రయత్నించడం వల్లనే బాధగా ఉందని ఆయన అన్నారు. తనపై చేసిన విమర్శలకు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పది రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.

ఉద్దేశ్యపూర్వకంగానే దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను బట్టే ఎన్నికల్లో టికెట్లు లభిస్తాయని ఆయన అన్నారు. విశాఖపట్నం పార్లమెంటు సీటు విషయంలో దగ్గుబాటి పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు తలదూర్చి టిఎస్సార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

సోమవారం టి. సుబ్బిరామిరెడ్డి దగ్దుబాటి వెంకటేశ్వర రావుకు లీగల్ నోటీసులు పంపించారు. దగ్గుబాటి తనపై ఇటీవల చేసిన ఆరోపణలు నిరూపించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కొనవల్సి వస్తుందని 12 అంశాలతో కూడిన నోటీసును దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు పంపించారు. భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని దగ్గుబాటి చెప్పారు. అందిన తర్వాత సమాధానం చెబుతానన్నారు.

English summary
The Congress parliament member T Subbirami Reddy suggested party MLA Daggubati Venkateswar Rao to learn culture from leter's wife and union minister Daggubati Purandeswari.హైదరాబాద్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X