వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలిపశువును చేశారు: బిసిసిఐపై రాజ్ కుంద్రా గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Raj Kundra
న్యూఢిల్లీ: ఐపియల్‌లో గ్యాంబ్లింగ్ ఆరోపణలపై తనను బిసిసిఐ సస్పెండ్ చేయడం పట్ల రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద స్థానాల్లో ఉన్నవారు తనను బలిపశువును చేశారని ఆయన ఆరోపించారు. బిసిసిఐ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి తాను దిగ్భ్రాంతికి, నిరాశకు గురయ్యానని, సస్పెన్షన్ కారణాలపై తాను పోరాటం చేస్తానని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉన్నత స్థానాల్లో ఉన్న పెద్దలు ఏ విధమైన ఆధారాలు లేకుండా తనపై అన్ని రకాల ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. కచ్చితమైన వాస్తవాలు లేకుండా తనను బలిపశువును చేశారని, రుజువు కాని విషయాలపై తనను మీడియా ముందు విచారణకు పెట్టారని ఆయన అన్నారు.

భారతదేశంలో క్రీడల అభివృద్దికి తాను కట్టుబడి పనిచేశానని, తనపై చేసిన ఆరోపణలకు తాను గాయపడ్డానని ఆయన అన్నారు. క్రీడలపైనే తనకు మొదటి ప్రేమ ఉంటుందనే విషయం తనను ఎరిగినవారందరికీ తెలుసునని, రాజస్థాన్ రాయల్స్‌లో తనకు 11.7 శాతం మైనారిటీ వాటా మాత్రమే ఉందని, మెజారిటీ వాటా సూపర్ ఫైట్ లీగ్‌దని ఆయన చెప్పారు.

భారతదేశంలో కొద్ది మంది మాత్రమే క్రీడల అభివృద్ధిపై చొరవ చూపి, విజయం సాధించారని, క్రీడల పట్ల తన నిజాయితీని ప్రశ్నించడంతో తన మనసు గాయపడిందని, ఈ విధమై అవినీతి దేశంలో విదేశీయుల పెట్టుబడులకు ఆటంకం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

శిల్పా శెట్టి దేశం విడిచి రావడానికి సిద్ధంగా లేదని, శిల్పాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తాను భారతదేశానికి రావాలని అనుకున్నానని, అయితే కొద్ది కాలంలోనే తనకు భారత్ పట్ల ప్రేమ పెరిగిందని ఆయన అన్నారు.

English summary
Rajasthan Royals co-owner Raj Kundra on Monday expressed shock at BCCI's decision to suspend him on charges of gambling in IPL and said he was being made a "scapegoat" by people in powerful positions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X