వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్‌కు యువతి అండ!: ఫ్యాన్స్‌కు షాకేనన్న థరూర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sreesanth
న్యూఢిల్లీ/కొచి: స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలపై అరెస్టైన క్రికెటర్లకు వారి స్నేహితురాళ్లు మద్దతుగా నిలుస్తున్నారు! అంకిత్ చవాన్‌ను ఆమె స్నేహితురాలు గత నెల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాత్కాలిక బెయిల్ పైన విడుదలైన చవాన్ తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు.

కేరళ పేసర్ శ్రీశాంత్ విషయంలోను ఇదే తరహా జరుగుతోంది. భోపాల్‌కు చెందిన ఒక అమ్మాయితో శ్రీశాంత్‌కు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ ఏడాది సెప్టెంబరులోనే నిశ్చితార్థం చేయాలని భావిస్తున్నారు.

ఫిక్సింగ్ ఉదంతం తర్వాత కూడా ఆ అమ్మాయి శ్రీశాంత్ వెంటే నిలిచిందని, ఆ విషయం అతనికి కూడా తెలుసునని, ఆ అమ్మాయి తండ్రి... శ్రీశాంత్ కోర్టు విచారణలకు హాజరవుతున్నారని, క్రికెటర్లపై మోకా విధించక ముందు శ్రీకి బెయిల్ వస్తుందని అతను లడ్డూలు కూడా తెచ్చారని ఓ మిత్రుడు చెప్పారని అంటున్నారు. తమ కుమారుడిని మరింత బాధించడం ఇష్టం లేకే శ్రీ తల్లిదండ్రులు రాకుండా కేరళలోనే ఉంటున్నారట.

శ్రీ అభిమానులకు బాధాకరం: శశి థరూర్

స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్ అరెస్టు కావడంతో కేరళ అభిమానులకు శరాఘాతమని కేంద్రమంత్రి శశి థరూర్ అన్నారు. ఐపిఎల్ ఫిక్సింగ్ ఎపిసోడ్‌ని కేరళలోని యువ అభిమానులు జీర్ణించుకోలేరు, క్రికెట్లో ఎదగాలనుకునే స్థానిక ఆటగాళ్లకు ఈ సంఘటన పెద్ద షాకే అని థరూర్ చెప్పారు.

English summary
Minister of state for HRD Shashi Tharoor on Sunday said the arrest of Kerala pacer S Sreesanth for alleged spot fixing is "very painful" for cricket fans in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X