వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధారాల్ని బట్టి అరెస్ట్, విమర్శలు సహజమే: జెడి రిలీవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సొంత రాష్ట్రంలో పని చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ మంగళవారం అన్నారు. లక్ష్మీ నారాయణ ఈ రోజు సిబిఐ నుండి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దర్యాఫ్తు చేస్తున్న కేసుల వల్ల తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నానని చెప్పారు.

తమపై రాజకీయంగా వచ్చిన ఆరోపణలను కోర్టు ద్వారానే సమాధానం చెప్పానని అన్నారు. మీడియాతో మాట్లాడారనే ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. సమాచార సేకరణలో భాగంగానే తాము మీడియాతో మాట్లాడినట్లు చెప్పారు. మీడియాతో మాట్లాడటం వల్ల కొంత సమాచారం సేకరించినట్లు చెప్పారు.

అవినీతికి పాల్పడే వారు, ప్రోత్సహించే వారి వల్ల అభివృద్ధికుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దర్యాఫ్తు చేస్తున్న మూడు కేసులకు సంబంధించి వేర్వేరు కోణాల్లో దర్యాఫ్తును చేసి వేర్వేరు ఛార్జీషీట్లను తాము కోర్టులో దాఖలు చేశామని చెప్పారు. సొంత రాష్ట్రంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. విచారణలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని, పక్షపాతం చూపించలేదన్నారు.

సిబిఐ పంజరంలో చిలుక వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. విచారణలో ఎలాంటి పొరపాట్లు చేయలేదని, పక్షపాతం చూపలేదన్నారు. విమర్శలు సహజమేనన్నారు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. ఆధారాలను బట్టే అరెస్టులు జరిగాయమని, రిటైర్మెంట్ తర్వాత తాను గురుకుల పాఠశాలను స్థాపిస్తానన్నారు.

కాగా లక్ష్మీ నారాయణ ఈ రోజు రిలీవ్ అయ్యారు. డిఐజి వెంకటేష్‌కు ఆయన బాధ్యతలు అప్పగించారు. జెడి లక్ష్మీ నారాయణను కేంద్రం ఈనెల 7వ తేదీన బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం నాడు రిలీవ్ కావాలని ఢిల్లీ సి.బి.ఐ. ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన లక్ష్మీ నారాయణ తిరిగి మాతృ సంస్థకు వెళుతున్నారు.

English summary
CBI JD Laxmi Narayana relieving today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X