వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరిని ఇరికించే యత్నం: కెటిఆర్, నేతలు సేఫ్: టిజి

By Srinivas
|
Google Oneindia TeluguNews

KTR and TG Venkatesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను తప్పించేందుకు మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం మండిపడ్డారు. జాతి సంపదను దోచుకోవడంలో యూపిఏ మొదటి స్థానంలో ఉందన్నారు. బొగ్గు కుంభకోణంలో దాసరి హయాంలోనే వేల కోట్లు చేతులు మారాయని తాము ఎప్పుడో చెప్పామన్నారు.

కిరణ్ జివోల రూపంలో అమలుపరుస్తున్నారు: హరీష్

తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా ఇవ్వనని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జివోల రూపంలో దానిని అమలుపరుస్తున్నారని తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత రైతులకు ఈ ప్రభుత్వం సహాయం చేయడం లేదన్నారు.

బయ్యారంపై బాబు ఎప్పుడో చెప్పారు: టిడిపి

బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2010లోనే చెప్పారని టిడిపి నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. తెరాస రాజకీయ లబ్ధి కోసం బయ్యారంను ఉపయోగించుకుంటోందన్నారు. బయ్యారం ఉక్కును విశాఖ తరలించవద్దని విశాఖ గడ్డపైనే బాబు చెప్పారని సండ్ర వెంకటవీరయ్య అన్నారు. టిఆర్ఎస్ వైయస్ హయాంలో కళ్లు మూసుకొని ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. బయ్యారం ఉక్కును తరలించవద్దని, అక్కడే పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి దయాకర రావు డిమాండ్ చేశారు.

ఉద్యమంలో నేతలు సేఫ్: టిజి వెంకటేష్

తెలంగాణ ఉద్యమంలో నేతలు భద్రంగా ఉన్నారని, కార్యకర్తలే బలవుతున్నారని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆందోళనలు ఎందుకన్నారు. తెలంగాణ ఇవ్వడం తేలికైతే కాంగ్రెసు ఎందుకు ఆగుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు జై కొడుతున్న పార్టీలను కలుపుకుపోని వారు తెలంగాణ ఎలా సాధిస్తారని ప్రశ్నించారు.

ఉద్యమంలో నేతలకు ఎలాంటి బాధలు కలగడం లేదన్నారు. కార్యకర్తలే జైలుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే, తెలంగాణ కోసం చెన్నా రెడ్డి జైలుకు వెళ్లారన్నారు. ఇప్పటి నేతలు అలా లేరన్నారు. ఉద్యమం పేరుతో అలజడి సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.

English summary
The UPA government has looted the country, said TRS MLA KT Rama Rao on Tuesday. He said UPA is in first place in looting counrty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X