వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీని వదిలేసినట్లే: బిజెపికి జస్వంత్ సింగ్ ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అగ్రనేత ఎల్‌కె అద్వానీని బిజెపి వదిలేసినట్లే కనిపిస్తోంది. అద్వానీ ఉన్నా లేకున్నా బిజెపి తన పని చేసుకుని పోతుందని బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దీన్నిబట్టి అద్వానీని పట్టించుకోకూడదనే గట్టి నిర్ణయానికి పార్టీ వచ్చినట్లే కనిపిస్తోంది. అద్వానీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తూనే తన పని తాను చేసుకుని పోవాలని బిజెపి నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అద్వానీ కోసం నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అద్వానీ దిగివస్తే మంచిదనే అభిప్రాయంతో బిజెపి నాయకత్వం ఉంది.

కాగా, నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న వర్గం అద్వానీకి బాసటగా నిలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అద్వానీ లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందననికేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. అద్వానీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అని అడిగితే సమస్యకు పరిష్కారం కనుక్కుంటారని అన్నారు.

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, దేశం ప్రయోజనాల దృష్ట్యా అద్వానీ లేవనెత్తిన ప్రశ్నలకు పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. అద్వానీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అద్వానీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి తగిన ప్రయత్నాలు జరుగుతాయని ఆయన చెప్పారు.

L K Advani

పార్టీ తిరస్కరించిన తర్వాత అద్వానీ రాజీనామా ప్రశ్నే లేదని మరో బిజెపి నేత సుష్మా స్వరాజ్ అన్నారు. రాజీనామాను తిరస్కరించిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రశ్న ఎలా తలెత్తుతుందని ఆమె అన్నారు. అద్వానీ తమ ముఖ్య నాయకుడని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

అద్వానీ విషయంలో ఆర్ఎస్ఎస్ ఒత్తిడి లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అద్వానీ సంక్షోభం విషయంలో వస్తున్న మీడియా వార్తల్లో నిజం లేదని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. ఆర్ఎస్ఎస్ అద్వానీ విషయంలో ఏమీ మాట్లాడలేదని అన్నారు. నరేంద్ర మోడీని ప్రచార కమిటీ అధిపతిగా నియమించిన విషయంలో వెనక్కి తగ్గకూడదని బిజెపి, ఆర్ఎస్ఎస్ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

English summary
Backing L K Advani, former Union minister Jaswant Singh on Tuesday said a solution should be found to the questions raised by the BJP patriarch soon in the interest of the party as well as the nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X