వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కుమ్మక్కు'పై చంద్రబాబు ఆవేదన, తెరాసపై యాష్కీ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Madhu Yashki
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం తెలంగాణ సాధన కోసం కాదని, అది తప్పటడుగు అని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ బుధవారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ కాదని, అది ఒక రాజకీయ పార్టీ అని చెప్పారు. శాసన సభ సమావేశాల త్రవాత తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీలం కలిసి ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు.

తెరాస ఉద్యమం పేరుతో రాజకీయంగా ఎదగాలని చూస్తోందన్నారు. అసెంబ్లీ ముట్టడిని రాజకీయ పార్టీల నాయకులే అడ్డుకోవాలన్నారు. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెత్త మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లోగా తెలంగాణ రావడం ఖాయమని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది కాబట్టే తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టడం లేదన్నారు.

కాంగ్రెస్ నేతలతో కలయికపై బాబు ఆవేదన

కాంగ్రెసు పార్టీ నేతలతో మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ తనపై రాజకీయ విమర్శలు గుప్పించడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కాంగ్రెసు నేతలతో మర్యాదపూర్వకంగా కలుస్తున్నప్పటికీ వాటిని రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారని పార్టీ నేతలతో అన్నారు.

కొందరు వాటికి వక్రభాష్యం చెబుతున్నారన్నారు. ఇకపై తాను ఎవరినీ కలువనని చెప్పారు. ప్రచారం కోసమే తనపై ఇలాంటి ఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రచారం కోసం ఇలా చేసే నేతలను అనుమతించరాదని బాబు పార్టీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి విమర్శలపై కాంగ్రెస్ నాన్ సీరియస్‌గా ఉందని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has responded on match fixing allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X