హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు! దమ్ముంటే గుట్టు విప్పు: కిషన్, రాష్ట్రానికి మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan reddy and Modi
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జులై మూడో వారంలో ఆంధ్ర ప్రదేశ్‌కు రానున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కిషర్ రెడ్డి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014లో జరగనున్న ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మోడీ ప్రభావం లేదంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దమ్ముంటే టిడిపి సర్వేలను బయట పెట్టాలన్నారు.

ఛలో అసెంబ్లీపై ప్రభుత్వం ద్వంద నీతితో వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బిజెపి ప్రచార కమిటీ చైర్మన్‌గా రంగంలోకి దిగిపోయారు. గాంధీనగర్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కొత్త నినాదం తీసుకున్నారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్' (ఒకే భారత్, ఉత్తమ భారత్) అనే నినాదం ఇచ్చారు.

ఇటీవల మోడీని ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో అసంతృప్తికి గురైన పార్టీ అగ్రనేత అద్వానీ బిజెపిలోని అన్ని పదవులకు గుడ్ బై చెప్పగా.. పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు కలిసి అద్వానీ రాజీనామా వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒప్పించారు.

రాజీనామాలను అద్వానీ ఉపసంహరించుకున్నారని, మునుపటి బాధ్యతల్లో కొనసాగుతారని రాజ్‌నాథ్ సింగ్ అద్వానీతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయాన్ని మీడియాకు చెప్పాలని తనకు అద్వానీ చెప్పినట్లు ఆయన తెలిపారు. మునుపటి బాధ్యతల్లో అద్వానీ కొనసాగుతారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

త్వరలో పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో అద్వానీ లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. తమ విన్నపాన్ని అద్వానీ మన్నించారని ఆయన చెప్పారు. రాజీనామాలు వద్దన్న పార్టీ నిర్ణయాన్ని అద్వానీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అద్వానీని అన్ని స్థాయిల్లోనూ సంప్రదించనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Gujarat chief minister Narendra Modi likely to visit andhra pradesh in July 3rd week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X