వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛలో అసెంబ్లీకి అనుమతివ్వం, దూరంగా ఐతే ఓకే: గీతా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Geeta Reddy
హైదరాబాద్: ఛలో అసెంబ్లీకి అనుమతి సాధ్యం కాదని మంత్రి గీతా రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ లేదా మరోచోట అయితే అనుమతికి అభ్యంతరం లేదని ఆమె అన్నారు. బుధవారం మొదటిసారి సభ వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా హోంశాఖ బాధ్యత తీసుకున్న గీతా రెడ్డి ఛలో అసెంబ్లీకి అనుమతి అసాధ్యమని తేల్చి చెప్పారు. అసెంబ్లీకి దూరంగా ఎక్కడైనా నిరశన సమావేశాలు జరుపుకోవచ్చునని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అలా అయితే అనుమతికి ఓకే చెప్పాలని భావిస్తోంది.

అంతకుముందు...

సభ జరగకుండా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యకు ముగింపు పలకాలని జూలకంటి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెసు తప్ప అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయన్నారు.

జలయజ్ఞంపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వైయస్ విజయమ్మ అన్నారు. పోలవరం, చేవెళ్ల తదితర ప్రాజెక్టులపై వ్యయం పెరుగుతుందే తప్ప ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సహా మూడు ప్రాంతాలకు సాగు నీరు అందేదన్నారు.

రైతులు విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తినే పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తామన్నారు. రైతు ప్రభుత్వమంటూనే వారికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సమస్యలపై సమాధానం చెప్పాలన్నారు. ఎన్జీ వర్సిటీలో మంత్రి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మోడీ ప్రధాని కావాలని దేశం చూస్తోందని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మోడీ సభ తెలంగాణ ప్రాంతంలో ఉంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు. కాగా, తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సీడి విషయంలో పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని తెరాస ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట బైఠాయించారు.

English summary

 In view of the Telangana Joint Action Committee's call for 'Chalo Assembly' on June 14, Minister Geeta Reddy Anurag Sharma on Wednesday said permission cannot be given for Chalo Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X