వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గం మాజీలకు షాక్: పూర్తి భద్రత ఉపసంహరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Police withdraw security to Three MLAs
విజయవాడ/హైదరాబాద్: అనర్హత వేటు పడిన కృష్ణా జిల్లా ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాలుగు రోజుల క్రితం పదిహేను మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అందులో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, బందరు ఎమ్మెల్యే పేర్ని నానిలు కూడా ఉన్నారు. వారికి అధికారులు పూర్తి భద్రతను ఉపసంహరించారు.

మరోవైపు బుధవారం అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు. ఆయా పార్టీలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. విత్తనాల కొరతపై తెలుగుదేశం, ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల జాతీయ హోదాపై వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణపై తీర్మానం కోరుతూ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, నాగం జనార్ధన్ రెడ్డి, వేణుగోపాల చారి, మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలపై సిపిఎం, ఛలో అసెంబ్లీకి అనుమతినికోరుతూ సిపిఐ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రధాని 15 సూత్రాల పథకంపై మజ్లిస్ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.

తెలంగాణవాదుల అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో పలువురు తెలంగాణవాదులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. బుధవారం ఉదయం అదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలో దాదాపు పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఛలో అసెంబ్లీ ఆందోళన నేపథ్యంలో వరంగల్ జిల్లాల్లోను ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం వరంగల్‌లో తెరాస నేతలు రవీందర్ రెడ్డి, సుదర్సన్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల తనిఖీలను చేపట్టారు.

English summary
Krishna District Police officials withdrawn security to three mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X