వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి వైఖరి చూస్తుంటే గుండె మండుతోంది: యెన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yennam Srinivas Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండె మండుతోందని భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ జిల్లా శాసన సభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం మండిపడ్డారు. తెలంగాణపై టిడిపి స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణపై చర్చ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చట్టాలను ప్రజలు ఏమాత్రం ఉల్లంఘించడం లేదని, అధికారులు, ప్రభుత్వాలే ఉల్లంఘిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

పోలీసులను ముఖ్యమంత్రి నియంత్రించక పోవడం దురదృష్టకరమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. తాము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లేదంటే ఏం జరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అందరు ఇందిరా పార్కు వద్దకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.

పోలీసులు అరెస్టు చేసిన పక్షంలో అడ్డుకున్న చోటునే నిరసనకు దిగాలన్నారు. మంత్రులు చలో అసెంబ్లీకి అనుమతిని ఇప్పించాలన్నారు. తమను అసెంబ్లీకి రానివ్వకుంటే మంత్రులను గ్రామాలకు రానిచ్చే ప్రసక్తి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారిని గ్రామాలకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలమని చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టులపై ఎందుకు స్పందించడం లేదన్నారు.

శుక్రవారం ఇందిరా పార్కు నుండి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా అక్రమ అరెస్టులు దారుణమన్నారు. శాంతియుతంగానే ఆందోళన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరువేలకు పైబడి బైండోవర్ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులను ప్రభుత్వం సృష్టించి భయాందోళనకు గురి చేస్తోందన్నారు. పోలీసుల నియంతృత్వాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

English summary
Bharatiya Janata Party MLA Yennam Srinivas Reddy expressed his angry at Telugudesam Party for party stand on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X