వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువరాజ్ ఫిక్స్‌చేస్తే కాల్చేస్తా, కపిల్ సారీ చెప్పి..: తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yuvraj Singh
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మ్యాచ్ ఫిక్సింగ్‌లో తన కుమారుడు యువరాజ్ సింగ్ పాత్ర ఉన్నట్టు తేలితే.. అతనిని షూట్‌చేసి పారేస్తానని అతని తండ్రి యోగ్‌రాజ్ సింగ్ అన్నాడు. ఒకనాటి బౌలరైన యోగ్‌రాజ్ సింగ్ ప్రస్తుతం 'భాగ్ మిల్కా భాగ్' చిత్రంలో కోచ్‌గా నటిస్తున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో ఐపిఎల్‌లో ఫిక్సింగ్ గురించి ప్రస్తావించినపుడు ఆయన ఎటువంటి తడబాటు, దాట వేత ధోరణి లేకుండా యువీ తలలో తూటా పేలుస్తానంటూ తీవ్రంగా స్పందించాడు. బాలీవుడ్‌లో ప్రవేశానికి యువరాజ్ సాయం తీసుకున్నారా? అని ప్రశ్నించగా అటువంటుదేమీ లేదన్నాడు.

తాను క్రికెట్ ఆడే రోజల్లో కొంతమంది కాళ్లు పట్టుకుని వుంటే ఇంకొంతకాలం క్రికెట్ ఆడేవాడినని, తాను ఆ పని చేయలేదని చెప్పాడు. తనకు ఆకలిగా ఉన్నపుడు కూడా తన కుమారుడ్ని డబ్బులు అడగలేదన్నాడు. క్రికెట్ ఆడిన రోజుల్లో బిషన్ సింగ్, కపిల్ దేవ్‌లు.. ఆట నుంచి తనను బయటికి గెంటినపుడూ తల వంచలేదన్నాడు.

ఒకవేళ తలవంచాల్సివస్తే చావనైనా చస్తానుగానీ తలవంచేది లేదన్నాడు. యువరాజ్‌కు గానీ అతని తల్లికి గాను మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాత్ర ఉన్నట్టు తేలితే సహించేది లేదని తీవ్రంగా స్పందించాడు. ఫిక్సింగ్‌లో యువీ భాగస్వామి అయితే.. అతని తలలో తుపాకీ తూటా పేలుస్తానని తీవ్రస్వరంతో అన్నారు.

అమరజవాన్ల జ్యోతి వద్ద వాడిని ఉరి తీస్తానని, ఇది ఈ దేశం నెత్తుటి ప్రతిజ్ఞ అని భావోద్వేగంతో చెప్పారు. నిన్నటితరం సీనియర్ క్రికెటర్లు బోధించిన దాన్నే నేటి తరం జూనియర్లు అచరిస్తున్నారని, తనకు గుర్తున్నంతలో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన దావూద్ ఇబ్రహీంను కపిల్ గెటౌట్ అని బయటకు పంపించాడన్నారు.

అతనెవరో తెలిశాక వెనక్కి పరుగెత్తి సారీ చెప్పి.. మరీ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడన్నారు. అప్పుడు నాటిన విషపు విత్తనాలు ఇప్పుడు పంటకొచ్చాయన్నారు. అయితే రూ.25 లక్షలు బదులుగా రూ.కోటి.. తేడా మాత్రం అంతే అన్నారు.

English summary
Indian Cricketer Yuvraj Singh's father Yograj Singh, who is himself a former Indian paceman and now currently an actor, says that he would put a bullet through his son's head if he found out that he was involved in match fixing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X