వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మకముంది: అంకిత్, కుటుంబ సభ్యులతో శ్రీ హ్యాపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కొచ్చి: న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందని బెయిల్ పైన విడుదలైన అంకిత్ చవాన్ అన్నాడు. న్యాయవ్యవస్థ సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులు, కుటుంబ సభ్యులకు చవాన్ కృతజ్ఞతలు చెప్పాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడు వంద శాతం కష్టపడ్డానని చెప్పాడు. ఫిక్సింగ్ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాను మాట్లాడలేనన్నాడు. తిరిగి తాను క్రికెట్ పై దృష్టి సారిస్తానని చెప్పాడు.

మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొని చవాన్‌తో పాటు బెయిల్ పైన విడుదలైన కేరళ పేసర్ శ్రీశాంత్ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకున్నాడు. శ్రీశాంత్ తల్లి ఉద్వేగానికి లోనై తనయుడిని దగ్గరకు తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీశాంత్ ఇంటికి రావడంతో తండ్రి, సోదరి ఆనందంగా గడిపారు.

Sreesanth returns home

అంతకుముందు కొచ్చిలో శ్రీశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తాను భారత జట్టులోకి తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రిగా పర్యటన సిరీస్‌లో ఆడటం తన కల అని, అది సాధ్యమవుతుందో లేదో కానీ 2015 ప్రపంచ కప్ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, కుట్రలో భాగంగా తనను అరెస్టు చేయవచ్చునని, నిజమేంటో త్వరలో తెలుస్తుందన్నాడు. శత్రువులకు కూడా ఇలాంటి బాధలు రాకూడదని, విచారణలో తనకు క్లీన్‌చిట్ లభిస్తుందన్న నమ్మకముందన్నాడు. సొంతూరు వచ్చినందుకు సంతోషంగా ఉందని, ఏ తప్పూ చేయలేదన్నాడు. తనను నమ్మమని చెప్పాడు.

న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. కష్టకాలంలో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. క్రికెట్ ఆడటమే నా కల. సాధన కొనసాగించి మళ్లీ జాతీయ జట్టులోకి వస్తా' అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు, బిసిసిఐ యాజమాన్యం, మీడియా అంతా తమతమ విధులు నిర్వర్తించారని అన్నాడు. అందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పాడు.

English summary
The Cochin International Airport witnessed a flurry of activity on Wednesday morning when cricketer Sreesanth landed here after being let out on bail by a Delhi court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X