వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ: సిఎంకు ఆజాద్ ఫోన్, కెసిఆర్‌పై జగ్గారెడ్డి పైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Azad calls Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ జెఎసి చేపట్టిన చలో అసెంబ్లీ నేపథ్యంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. చలో అసెంబ్లీ కార్యక్రమం పరిణామాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాలను పంపినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చలో అసెంబ్లీ పరిణామాలపై కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఆజాద్ ప్రధాని నివాసంలో ఏర్పాటైన పార్టీ కోర్ కమిటీ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా ఆజాద్ వెళ్లారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ డిమాండ్ కెసిఆర్ వల్ల వచ్చింది కాదని, గత యాభై ఏళ్లుగా ఈ డీమాండ్ ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గత 50 ఏళ్ల కాలంలో ప్రజలు నమ్మి అనేక మంది నాయకులకు అవకాశం కల్పించారని, అయితే వారు స్వలాభం కోసం వాడుకున్నారని ఆయన అన్నారు.

చట్టసభల్లో మాట్లాడే అవకాశం లేని పార్టీలు చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు చేపడుతాయని, శాసనసభలోనూ పార్లమెంటులోనూ మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ తెరాస చలో అసెంబ్లీని చేపట్టిందని ఆయన అన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకంగా లేరని ఆయన అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలను వేదికలుగా చేసుకుని తెలంగాణ సాధిస్తామని కెసిఆర్ గతంలో చెప్పారని, కెసిఆర్ పార్లమెంటుకు సరిగా వెళ్లరని, తెలంగాణపై మాట్లాడరని ఆయన అన్నారు.

పార్లమెంటులో తెలంగాణపై కెసిఆర్ ఎన్నిసార్లు మాట్లాడారని ఆయన అడిగారు. కెసిఆర్ స్వలాభం కోసం ఉద్యమాన్ని అడ్డం పెట్టుకున్నారని ఆయన విమర్శఇంచారు. అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఉంటుందనే ముఖ్యమంత్రి శానససభా సమావేశాలను ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. దాన్ని తెరాస సద్వినియోగం చేసుకోవడం లేదని అన్నారు. తెరాస రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించకుండా తెలంగాణను ఊబిలా తయారు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మాట్లాడకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మంచి మాటలు చెప్పినా తెరాస నాయకులు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

English summary
It is said that Congress affairs incharge Ghulam Nabi Azad called CM Kiran kumar Reddy on Chalo Assembly. Congress MLA Jagga Reddy fired at telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X