వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొక్కులు: అరటిపండ్లతో శ్రీశాంత్ తులాభారం

By Pratap
|
Google Oneindia TeluguNews

కొచ్చి/ న్యూఢిల్లీ: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్న క్రికెటర్ శ్రీశాంత్ శుక్రవారం అరటిపండ్లతో తులాభారం తూగాడు. శ్రీపూర్ణత్రయీశ వైష్ణవ ఆలయంలో ఈ మొక్కు తీర్చుకున్నాడు. ఐపియల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్‌ను మే 16న పోలీసులు అరెస్టు చేశారు. దాంతో 27 రోజుల జైలు జీవితం గడిపి ఈ నెల 11న బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

తులాభారం కేరళలో భక్తులు ఆచరించే ముఖ్య సంప్రదాయం. పెద్ద త్రాసులో ఒక వైపున కూర్చున్న భక్తుని బరువుకు సరిపడా కొబ్బరికాయలు, అరటి గెలలు, చక్కెర లేదా బెల్లం వంటి వస్తువుల్ని రెండో వైపున ఉంచి తూయడమే తులాభారం. ఆవిధంగా తూచిన వస్తువుల్ని మొక్కుబడిగా ఆలయంలో సమర్పిస్తారు.

S Sreesanth

శ్రీశాంత్‌ వెంట అతని తల్లిదండ్రులు, శాంతకుమారన్, తల్లి సావిత్రీదేవి, బావ, మలయాళీ నేపథ్య గాయకుడు మధు బాలకృష్ణన్ తదితరులు ఉన్నారు. అనంతరం శ్రీశాంత్ శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి తన అన్నయ్య దీపూశాంత్‌తో కలిసి బయల్దేరి వెళ్లాడు. తాను ఏ తప్పూ చేయలేదని శ్రీశాంత్ మరోసారి ఈ సందర్భంగా అన్నాడు.

శ్రీశాంత్‌తో పాటు అరెస్టయిన అంకిత్ చండిలకు కూడా బెయిల్ లభించింది. ఆ తర్వాత మరో క్రికెటర్ అజిత్ చండిల బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. చండిలకు బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

/ న్యూఢిల్లీ: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకున్న క్రికెటర్ శ్రీశాంత్ శుక్రవారం అరటిపండ్లతో తులాభారం తూగాడు. శ్రీపూర్ణత్రయీశ వైష్ణవ ఆలయంలో ఈ మొక్కు తీర్చుకున్నాడు. ఐపియల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్‌ను మే 16న పోలీసులు అరెస్టు చేశారు. దాంతో 27 రోజుల జైలు జీవితం గడిపి ఈ నెల 11న బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

తులాభారం కేరళలో భక్తులు ఆచరించే ముఖ్య సంప్రదాయం. పెద్ద త్రాసులో ఒక వైపున కూర్చున్న భక్తుని బరువుకు సరిపడా కొబ్బరికాయలు, అరటి గెలలు, చక్కెర లేదా బెల్లం వంటి వస్తువుల్ని రెండో వైపున ఉంచి తూయడమే తులాభారం. ఆవిధంగా తూచిన వస్తువుల్ని మొక్కుబడిగా ఆలయంలో సమర్పిస్తారు.

శ్రీశాంత్‌ వెంట అతని తల్లిదండ్రులు, శాంతకుమారన్, తల్లి సావిత్రీదేవి, బావ, మలయాళీ నేపథ్య గాయకుడు మధు బాలకృష్ణన్ తదితరులు ఉన్నారు. అనంతరం శ్రీశాంత్ శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి తన అన్నయ్య దీపూశాంత్‌తో కలిసి బయల్దేరి వెళ్లాడు. తాను ఏ తప్పూ చేయలేదని శ్రీశాంత్ మరోసారి ఈ సందర్భంగా అన్నాడు.

శ్రీశాంత్‌తో పాటు అరెస్టయిన అంకిత్ చండిలకు కూడా బెయిల్ లభించింది. ఆ తర్వాత మరో క్రికెటర్ అజిత్ చండిల బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. చండిలకు బెయిల్ ఇవ్వవద్దని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

English summary
Disgraced India pacer S Sreesanth, out on bail after being arrested in the IPL spot fixing case, today offered 'thulabharam', a ritual, at the famous Sree Poornathrayeesa temple of Lord Vishnu at nearby Tripunithura this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X